‘మహర్షి’లో మహేష్ – పూజా రొమాంటిక్ లుక్..!

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నెలలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 25న విడుదల [more]

Update: 2019-02-04 05:48 GMT

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం మహర్షి ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ నెలలో షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఏప్రిల్ 25న విడుదల చేయాలని మహేష్ అండ్ టీం ప్రయత్నం చేస్తోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఇప్పటివరకు పూజా హెగ్డే లుక్ వదల్లేదు. నిన్న ఈ చిత్రంలో పూజా లుక్ ని రివీల్ చేసారు మేకర్స్.

అరవింద లుక్ లోనే…

మహేష్ బాబు, పూజా హెగ్డేల రొమాంటిక్ స్టిల్ ను విడుదల చేశారు. మహేష్ ని ప్రేమగా హగ్ చేసుకుని ఉన్న స్టిల్ చాలా క్యూట్ గా ఉంది. ఎన్టీఆర్ అరవింద సమేతలో పూజా ఎలా అయితే కనిపించిందో ఇప్పుడు దాదాపు అదే మేకోవర్ తో కనిపించబోతుంది. మహేష్ మాత్రం కాస్త గడ్డం మీసాలతో కొత్తగా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రం కోసం పూజా హెగ్డే ఏకంగా 1.75 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా టాక్. తెలుగులో వరుసగా టాప్ హీరోస్ తో నటిస్తున్న పూజాకు ఈ సినిమా మరింత హెల్ప్ అవ్వనుంది.

Tags:    

Similar News