మహేష్ “చిల్లింగ్ మిక్స్ విత్ ది బాయ్స్”..!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న టీం త్వరలోనే మరో షెడ్యూల్ కోసం [more]

Update: 2018-12-31 07:22 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘మహర్షి’ సినిమాతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్న టీం త్వరలోనే మరో షెడ్యూల్ కోసం రెడీ అవుతుంది. అయితే ఈ గ్యాప్ లో మహేష్ హాలిడేని ఎంజాయ్ చేయడానికి తన ఫామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. నమ్రతతో పాటు తన ఇద్దరి పిల్లలతో కలిసి వెళ్లాడు మహేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే నమ్రత ఈ ఫొటోస్ ని మహేష్ ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. అయితే ఈసారి మహేష్ బాబు స్వయంగా తన ఫ్యాన్స్ కోసం ఓ పిక్ ను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసాడు. ఆ ఫోటో కింద “చిల్లింగ్ మిక్స్ విత్ ది బాయ్స్” అంటూ ఆ ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు.

సోషల్ మీడియాలో వైరల్

దుబాయ్ లోని ఓ స్టార్ హోటల్ లో క్సేవియర్ అగాస్టిన్, క్రిష్ణ భూపాల్ లతో కలిసి ఉన్న పిక్ ను విడుదల చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ పిక్ లో మహేష్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. మహేష్ చేస్తున్న ‘మహర్షి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల అవుతుంది.

Tags:    

Similar News