'ఒక్కడు'...'రాజా ది గ్రేట్' రెండు స్టోరీస్ ఒక్కటే!

Update: 2018-07-22 05:38 GMT

ఎన్నో సినిమాలకు రైటర్ గా పని చేసిన పరుచూరి బ్రదర్స్ లో ఒక్కరైనా పరుచూరి గోపాలకృష్ణ గత కొంత కాలంగా యూట్యూబ్ లో 'పరుచూరి పలుకులు' అని ఛానల్ పెట్టి సినిమాలకు సంబంధించి పాఠాలు నేర్పుతున్నారు. అయితే లేటెస్ట్ గా ఈయన ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు.

మహేష్ బాబు 'ఒక్కడు'.. రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమాలకు చాలా దగ్గర పోలికలు ఉన్నాయి అని ఆ కార్యక్రమంలో చెప్పారు. ముందుగా 'ఒక్కడు' సినిమా గురించి మాట్లాడితే.."అందులో పోలీస్ ఆఫీసర్ కొడుకు ఐన మహేష్ బాబు పోలీస్ అవ్వాలన్నదే ఆ తండ్రి కోరిక. అతను కబాడీ ఆట ఆడి గెలిస్తే దాని ద్వారా పోలీస్ ఉద్యోగం వస్తుందని ఆ తండ్రి ఆశపడి కొడుకును కర్నూలులో జరుగుతున్న కబడ్డీ పోటీలకు పంపుతాడు. అక్కడికి వెళ్లి తన కొడుకు ఒక అమ్మాయి ఆపదలో ఉందని తెలుసుకుని ఆ అమ్మాయని కాపాడి ఆ అమ్మాయి మనసును గెలుస్తాడు..ఆటను గెలుస్తాడు. ఇది 'ఒక్కడు' సినిమా స్టోరీ.

ఇక 'రాజా ది గ్రేట్' సినిమా విషయానికి వస్తే.. ఇందులో ఓ లేడీ కానిస్టేబుల్ తన కొడుకు పోలీస్ అవ్వాలనుకుంటుంది. అందుకని అతను కబడ్డీ ఆడి గెలిస్తే పోలీస్ ఉద్యోగం కోసం రికమెండేషన్ చెయ్యొచ్చని ఆశపడుతుంది. ఆ ప్రయత్నంలోనే హీరోయిన్ కష్టాల్లో ఉంటె ఆమెకు అండగా నిలుస్తాడు హీరో. ఆ అమ్మాయిని కాపాడటం కోసం ఎన్నో కష్టాలు పడి ఆ అమ్మాయి మనసుని కూడా గెలుచుకుంటాడు. ఈ రెండు సినిమాల క్లైమాక్స్ చూసుకుంటే..విలన్ ను హీరోతో కాకుండా వేరొకరితో చంపిస్తారు. ఇప్పుడు హీరోను అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో ప్రేక్షకులు బయటికి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే అలా చేశారు. దీనిబట్టి చూస్తే మీకే అర్ధం అవుతుంది. రెండు లైన్లు ఒకటే .. స్క్రీన్ ప్లే లోనే మార్పు కనిపిస్తుంది " అని పరుచూరి పౌర్చూరి గోపాలకృష్ణ గారు

Similar News