బాలీవుడ్ అంటే భయపడుతున్నాడా?

చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ.. బాలీవుడ్ మీద మోజు పడరు. హీరోయిన్స్ అయితే బాలీవుడ్ టార్గెట్ గానే రంగంలోకి దిగుతారు. సౌత్ లో హిట్స్ కొట్టాక [more]

Update: 2020-02-29 13:44 GMT

చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ.. బాలీవుడ్ మీద మోజు పడరు. హీరోయిన్స్ అయితే బాలీవుడ్ టార్గెట్ గానే రంగంలోకి దిగుతారు. సౌత్ లో హిట్స్ కొట్టాక చివరికి బాలీవుడ్ కెళ్ళి సెటిలవుదామనుకుంటారు. కానీ సౌత్ హీరోల్లో చాలామందికి బాలీవుడ్ అంటే పిచ్చ ఉండదు. అయితే రాజమౌళి బాహుబలి తర్వాత ప్రభాస్ కి బాలీవుడ్ ని కొల్లగొట్టాలనే ప్లాన్ ఉంది. కానీ ధైర్యంగా బాలీవుడ్ కి వెళ్లలేక తెలుగు నుండే బాలీవుడ్ లో సినిమాలు విడుదల చేస్తూ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. చాలా త్వరగా స్టార్ డం సంపాదించినా విజయ్ దేవరకొండ ధైర్యంగా బాలీవుడ్ లోకి పాన్ ఇండియా మూవీ తో అడుగుపెట్టాడు. ప్రస్తుతం మహేష్ బాబు ముంబై లో ఉన్నాడని.. మహేష్ కూడా హిందీ ఫిలిం ప్లాన్ చేస్తున్నాడనుకున్నారు.

కానీ మహేష్ కి బాలీవుడ్ నుండి ఎప్పటినుండో పిలుపులొస్తున్నా.. సౌత్ ని వదలడం లేదు. సౌత్ లో సూపర్ స్టార్. కానీ బాలీవుడ్ మీద మోజు లేదనిపిస్తుంది. తాజాగా ఓ యాడ్ షూట్ కోసం ముంబై లో ఉన్న మహేష్ బాబు కి ఓ నిర్మాత బంపర్ ఆఫర్ ఇచ్చాడట. బాలీవుడ్ బడా నిర్మాత సాజిద్ నాడియాద్వాలా రణ్ వీర్ సింగ్‌ తో ఓ మల్టీస్టారర్ చెయ్యాలని అనుకున్నాడట. అందుకే రణ్వీర్ సింగ్ తో పాటుగా ఆ సినిమా కోసం మహేష్ ని నటించమని ప్రపోజల్ పెట్టాడట. దానికోసం భారీ పారితోషకం కూడా ఆఫర్ చేసాడట. కానీ మహేష్ అలోచించి చెబుతా అని మెల్లగా జరుకున్నట్లుగా బాలీవుడ్ మీడియా టాక్. అయితే ఓ బడా సంస్థ భారీ ఆఫర్ ఇచ్చింది కదా అని.. బాలీవుడ్ కి వెళ్లడం ఎందుకు.. తెలుగులోనే కూల్ గా మూవీస్ చేసుకుంటే బెటర్ కదా అని మహేష్ కి సన్నిహితులు సలహా ఇవ్వడం, బాలీవుడ్ లో సక్సెస్ కాకపోతే తెలుగులోనూ ఇబ్బంది పడాలనే ఆలోచనతోనే మహేష్ బాలీవుడ్ ఆఫర్ ని లైట్ తీసుకున్నాడని టాక్.

Tags:    

Similar News