మహేష్ మేనల్లుడు కి డైరెక్టర్ దొరికేసాడు

మహేష్ బాబు బావ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ ను హీరోగా గా లాంచ్ చేయాలి ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు కానీ వర్క్ [more]

Update: 2019-07-07 16:04 GMT

మహేష్ బాబు బావ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కొడుకు గల్లా అశోక్ ను హీరోగా గా లాంచ్ చేయాలి ఎప్పటినుండో ట్రై చేస్తున్నారు కానీ వర్క్ అవుట్ అవ్వడంలేదు. ఇతన్ని హీరో గా లాంచ్ చేయడానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు రంగం లోకి దిగినప్పటికీ ఈ ప్రాజెక్ట్ వెనుకంజ వేయాల్సివచ్చింది. అందుకు కారణం కుర్రాడి వ్యవహారం ఏమంత ప్రామిసింగ్ గా కనిపించకపోవడమే అని వార్తలు వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటె గల్లా అశోక్ ను ఎవరి చేతిలో పెడదాం అని ఆలోచిస్తున్న టైములో జయదేవ్ కి రెండు మూడు పేర్లు వినిపించాయి. కానీ అవిఏమి ఫైనల్ చేయకుండా లాస్ట్ కి ఓ పేరు ఫైనల్ చేసాడు. భలే మంచి రోజు, దేవ్ దాస్ సినిమాలు అందించిన శ్రీరామ్ ఆదిత్య చేతిలో పెట్టారు ఈ కుర్రాడిని ఇప్పుడు. ఈ ప్రాజెక్ట్ కి నిర్మాతగా గల్లా కుటుంబమే వ్యవహరిస్తుంది. గల్లా అశోక్ బాడీ లాంగ్వేజ్ కు సరిపడా మాంచి థ్రిల్లర్ స్టోరీని తయారుచేసే పనిలో బిజీగా వున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీని గురించి పూర్తి క్లారిటీ రానుంది. అయితే మీడియం బడ్జెట్ లో ఈసినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News