పెద్దల అనుమతి కోసం నాలుగేళ్లు వెయిట్ చేసిన సూపర్ కపుల్?

హీరో, హీరోయిన్ ప్రేమించుకుని పెళ్ళికి సిద్దపడిన.. పెద్దవాళ్ళ అనుమతి కోసం వెయిట్ చెయ్యడం అనేది మాములు విషయం కాదు. కానీ ఓ హాట్ అండ్ క్యూట్ కపుల్ [more]

Update: 2020-02-16 04:06 GMT

హీరో, హీరోయిన్ ప్రేమించుకుని పెళ్ళికి సిద్దపడిన.. పెద్దవాళ్ళ అనుమతి కోసం వెయిట్ చెయ్యడం అనేది మాములు విషయం కాదు. కానీ ఓ హాట్ అండ్ క్యూట్ కపుల్ మాత్రం ప్రేమించుకున్నాక పెద్దవాళ్ళ అనుమతి కోసం నాలుగేళ్లు ఎదురు చూసి మరీ.. వారిని ఒప్పించి పెళ్లి చేసుకుందట. ఆ జంట ఎవరో కాదు.. టాలీవుడ్ క్యూట్ జంట మహేష్ బాబు – నమ్రత శిరోడ్కర్. మహేష్ బాబు – నమ్రత లు వంశి సినిమా షూటింగ్ అప్పుడు ప్రేమలో పడ్డారట. కానీ మహేష్ తండ్రి కృష్ణ, నమ్రత తల్లి తండ్రులు వాళ్ళు ప్రేమను ఒప్పుకోలేదట. ఈ విషయం స్వయంగా నమ్రతానే చెబుతుంది.

కానీ నాలుగేళ్లు వాళ్ళ తల్లితండ్రుల అనుమతి కోసం ఎదురు చూశామని.. చివరికి కృష్ణ గారు, తమ తల్లి తండ్రులు పెళ్లికి ఒప్పుకుని 2005 లో తమకి పెళ్లి చేసారని చెబుతుంది. మరి ఈ నాలుగేళ్లలో కనీసం కలవడం కానీ, షికార్లకి తిరగడం కానీ చేయలేదట ఈ జంట. కేవలం ఫోన్స్ లోనే మాట్లాడుకునేవారట. ఇక మహేష్ కి చచ్చేంత సిగ్గని, హీరోయిన్స్ తో కూడా మాట్లాడరని చెబుతుంది. మరి పెళ్లి తర్వాత వాళ్ళ బంధం రోజు రోజు కి రెట్టింపు అవుతుంది కానీ.. తరగడం లేదనేది వారి అనుబంధాన్ని చూస్తే తెలుస్తుంది. మహేష్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీకి టైం ఇవ్వడమే కాదు..సరదాగా గడుపుతాడు. మహేష్ బిజీగా వున్నా నమ్రత ఇల్లు, బిజినెస్ లు చక్కబెట్టుకుంటూ.. ఈజంట అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Tags:    

Similar News