మళ్ళీ ఆ తరహా పాత్రా.. వద్దంటున్న అభిమానులు

సరిలేరు సినిమా హిట్ అవడంతో.. హ్యాపీ గా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు… నిన్న నమ్రత బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ కూడా [more]

Update: 2020-01-23 05:05 GMT

సరిలేరు సినిమా హిట్ అవడంతో.. హ్యాపీ గా ఫ్యామిలీతో విదేశాలకు చెక్కేసిన మహేష్ బాబు… నిన్న నమ్రత బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ కూడా చేసాడు. అయితే సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ బాబు మూడు నెలల భారీ గ్యాప్ తర్వాత మహర్షి డైరెక్టర్ వంశి పైడిపల్లి సినిమా కోసం రెడీ అవుతాడు. వంశి పైడిపల్లి మహేష్ కి కథ వినిపించి… ఇంప్రెస్స్ చేసి మరోసారి సినిమా చెయ్యడానికి ఒప్పించడమే కాదు.. మహేష్ వెనకాల వెనకాలే తిరుగుతున్నాడు. అయితే వంశి పైడిపల్లి మహర్షి సినిమాలో స్టూడెంట్ కం కంపెనీ సీయివో గా మహేష్ ని చూపించాడు.

అయితే మూడు నెలల తర్వాత మొదలు కాబోతున్న వంశి – మహేష్ సినిమాలో మహేష్ ఈసారి స్పై గా కనిపించబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. స్పై గా మహేశ్ బాబు డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపించనున్నాడనీ ఫిలింనగర్ టాక్. మరి మహేష్ ఈ స్పై పాత్ర చెయ్యడానికి ఎలా ఒప్పుకున్నాడో అంటూ మహేష్ అభిమానులు కంగారు పడుతున్నారు. ఎందుకంటే గతంలో మురుగ డైరెక్ట్ చేసిన స్పైడర్ సినిమాలో మహేష్ స్పై గా నటిచడం, ఆ సినిమా ప్లాప్ అవడంతో.. మరోసారి మహేష్ స్పై పాత్ర అనే సరికి మహేష్ అభిమానులకి కంగారు పుడుతుంది.

Tags:    

Similar News