హిందీ లో మహేష్ బాబు సినిమా

బాహుబలితో మనం ఏంటో మన సత్తా ఏంటో అని ఇండియా మొత్తం తెలిసేలా చేసింది ఆ మూవీ. హద్దులు చెరిపేసినా ఈమూవీ తరువాత సాహో కూడా అదే [more]

Update: 2019-09-27 09:54 GMT

బాహుబలితో మనం ఏంటో మన సత్తా ఏంటో అని ఇండియా మొత్తం తెలిసేలా చేసింది ఆ మూవీ. హద్దులు చెరిపేసినా ఈమూవీ తరువాత సాహో కూడా అదే విధంగా క్రేజ్ దక్కించుకుంది అక్కడ. ఇక సైరా తో చిరు బాలీవుడ్ మార్కెట్ లో కి ఎంటర్ అవ్వనున్నాడు. రామ్ చరణ్ ఈ మూవీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ ఈ సినిమాను భారీగా రిలీజ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో మన సినిమాలకి ఆధరణ లభించడంతో మన స్టార్ హీరోస్ ఒకరికొకకు మెల్లమెల్లగా బాలీవుడ్ లో ఎంటర్ అవ్వాలని చూస్తున్నారు.

హిందీ రిలీజ్ కోసం…..

ఈ క్రమంలోనే మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సరిలేరు నీకెవ్వరు సినిమాని హిందీ లో రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. నమ్రత ఆల్రెడీ అక్కడ బయ్యర్స్ తో మాట్లాడి అక్కడ రిలీజ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. హిందీ ప్రేక్షకులకి నచ్చే విధంగా ఎలిమెంట్స్ ను ఎక్కువ పెట్టాలంటూ దర్శకుడు అనీల్ రావిపూడితో నమ్రత చెప్పినట్లుగా తెలుస్తోంది.

బుల్లి తెరపై సందడి…..

బాలీవుడ్ లో మంచి బయ్యర్స్ ని పట్టుకుంటే అక్కడ సినిమాను భారీగా రిలీజ్ చేయొచ్చని నమ్రత ట్రై చేస్తుంది. ఆల్రెడీ మహేష్ మూవీస్ అక్కడ హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్, బుల్లి తెరపై సందడి చేశాయి. సో అందువల్ల మహేష్ బాబు అక్కడ ప్రేక్షకులకు సుపరిచితుడే. అందుకే నమ్రత ఈనిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు ఎప్పటినుండో హిందీలో తన సినిమాలని రిలీజ్ చేయాలనీ చూస్తున్నాడు కాబట్టి ఈ ప్రొపోజల్ కి దిల్ రాజు ఒప్పుకున్నట్టే. చూడాలి మరి ఇందులో ఎంతవరకు నిజముందో అని.

 

Tags:    

Similar News