మహేష్ కోసం 2 కోట్లు ఖర్చంట..!

చాలాకాలం వెయిట్ చేసిన తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు సెట్స్ లో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు [more]

Update: 2019-03-02 09:57 GMT

చాలాకాలం వెయిట్ చేసిన తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లికి ఛాన్స్ ఇచ్చాడు. తన టాలెంట్ ను నిరూపించుకునేందుకు సెట్స్ లో డే అండ్ నైట్ కష్టపడుతున్నాడు వంశీ. మహర్షి అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. రెండు సాంగ్స్, కొంత ప్యాచ్ వర్క్ తప్ప షూటింగ్ దాదాపు కంప్లీట్ అయిపోయినట్టే. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే దేవి.. మహేష్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఒక అద్భుతమైన టైటిల్ సాంగ్ ని కంపోస్ చేసాడట.

పాట కోసం రెండు కోట్లు

ఈ సాంగ్ ను చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకేక్కించాలనేది వంశీ పైడిపల్లి ప్లాన్. అందుకోసం వంశీ ఈ సాంగ్ కు దాదాపు రెండు కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని టాక్. ప్రొడ్యూసర్లలో ఒకరయిన దిల్ రాజు కూడా ఇందుకు ఓకే చెప్పాడట. మహేష్ మూవీస్ లో ఇంట్రడక్షన్ సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. అందుకే ఈ సాంగ్ ని కూడా హైరేంజ్ లో ఉండేలా ప్లాన్ చేశాడట దిల్ రాజు. ఇక ముందుగానే ప్రకటించినట్టు ఈ మూవీ ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News