మహర్షితో ఆ సెంటిమెంట్ కి బ్రేక్ వేస్తాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో సినిమాపై అంచనాలు [more]

Update: 2019-05-07 07:50 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 25వ చిత్రం ‘మహర్షి’ మే 9న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. విడుదల తేదీ దగ్గర పడడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాపై ఎంత క్రేజ్ ఉందో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ చూస్తే అర్ధం అవుతుంది. మొదటిరోజే అదిరిపోయే రికార్డు కైవసం చేసుకుంది. మహేష్ 25వ చిత్రం సెంటిమెంట్ ప్రకారం కలిసొస్తుందా అన్నది అభిమానుల్ని కలచివేస్తుంది. రీసెంట్ గా పలువురు హీరోలు 25వ చిత్రం ల్యాండ్‌మార్క్‌ దాటారు.

వారి సినిమాలు ఫ‌ట్‌

అయితే అందులో తారక్ ‘నాన్నకు ప్రేమతో’ మాత్రమే ఓవర్సీస్‌ వరకు హిట్టయింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా లాస్ వెంఛరే అయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ చిత్రం ‘అజ్ఞాతవాసి’ చిత్రమయితే దారుణంగా ఫ్లాపయింది. అలానే నితిన్‌కి ‘ఛల్‌ మోహన్‌ రంగ’తో క్వార్టర్‌ సెంచరీ కంప్లీట్‌ అయింది. ఇది కూడా లాస్‌ వెంఛరే. ఈ నేపథ్యంలో మహేష్‌ ఈ ల్యాండ్‌ మార్క్‌ ఫిలింని సక్సెస్ ఫుల్ గా దాటగలడా లేదా సెంటిమెంట్ పరంగా 25వ చిత్రం ఫెయిల్ అవుతుందేమో చూడాలి. ఏది ఏమైనా ‘మహర్షి’ చిత్రంపై మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు.

Tags:    

Similar News