మహర్షి అప్పుడే 200 కోట్ల క్లబ్బులోనా?

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన మహర్షి సినిమా మే 9 న విడుదలై యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో [more]

Update: 2019-06-05 08:28 GMT

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో మొదటిసారిగా తెరకెక్కిన మహర్షి సినిమా మే 9 న విడుదలై యావరేజ్ టాక్ తో మంచి కలెక్షన్స్ తో నిర్మాతలను సేవ్ చేసింది. కొన్ని ఏరియాలలో మహర్షి సినిమా కలెక్షన్స్ పర్వాలేదనిపించింది… నైజాం ఏరియా లో అయితే మహేష్ సినిమాలు ఎన్నడూ సాధించని కలెక్షన్స్ ని మహర్షి సినిమా కొల్లగొట్టింది. అయితే మహర్షి సినిమా విడుదలైనప్పటినుండి ప్రతి వారం మహర్షికి కలిసొచ్చింది. మహర్షి సినిమా తర్వాత వారాల్లో విడుదలైన సినిమాలన్నీ వరసగా ప్లాప్ అవడంతో.. మహర్షి సినిమా ఈ కలెక్షన్స్ సాధించింది.

ఇక మహర్షి సినిమా విడుదలైన 27 రోజులకి మహర్షి సినిమా 200 కోట్ల గ్రాస్ ను రాబట్టేసి 200 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. మరి మహేష్ బాబు కెరీర్ లోనే ఈ కలెక్షన్స్ బెస్ట్ కలెక్షన్స్ గా చెబుతున్నారు. మరి ఈ కలెక్షన్స్ చూసిన దిల్ రాజు తో పాటుగా ఈ సినిమా నిర్మాతలైన పీవీపీ, అశ్వినీదత్ లు కూడా హ్యాపీ నే. అయితే మహర్షి కి కొన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ చేరుకోవడం కష్టమే. అయితే మహర్షి సినిమా బయ్యర్లు భారీగా నష్టపోకపోయినా…. ఎంతోకొంత నష్ట పోతారని అంటున్నారు

Tags:    

Similar News