ఫుల్ స్వింగ్ లో ‘మహర్షి’ షూటింగ్

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ సినిమా [more]

Update: 2019-03-09 07:44 GMT

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న ‘మహర్షి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మే తొమ్మిదిన రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘మహర్షి’ సినిమా మీద ట్రేడ్ లోను, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలే ఉన్నాయి. షూటింగ్ ఆలస్యమవడంతో.. ఏప్రిల్ 25 న విడుదలవ్వాల్సిన సినిమా మే తొమ్మిదికి మర్చారు. ఇక దిల్ రాజు – పివిపి – అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈచిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా బ్యాలెన్స్ ఉండడంతో… మండుటెండలో కూడా మహర్షి షూటింగ్ లో మహేష్ అండ్ మహర్షి టీం కష్టపడుతున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. అలాగే ప్రమోషన్‌లో నిమగ్నమైంది మహర్షి టీం.

అయితే తాజాగా వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ స్టిల్స్ లో మహేష్ ఎంతో అందంగా కనబడుతున్నాడు. మహేష్ కి అంత ఏజ్ ఉంటుందా.. ఇంకా 30 ఏళ్ళ కుర్రాడిలా మెరిసిపోతున్నాడు. ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ లో మహేష్ యంగ్ అండ్ హ్యాండాసోమ్ లుక్ లో ఇరగదీస్తున్నాడు. వంశి పైడిపల్లి మహేష్ ని చాలా స్టైలిష్ గా ఈ సినిమా లో చూపించబోతున్నాడు. ఇక అల్ల్లరి నరేష్ మహేష్ ఫ్రెండ్ గా నటిస్తున్న ఈ సినిమా రైతుల సమస్యల చుట్టూనే తిరుగుతుందని టాక్ ఉంది. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మహేష్ ‘మహర్షి’ సినిమా టీజర్ ఈ నెలాఖరున విడులవుతుంది అంటున్నారు. మరి మే తొమ్మిదిన విడుదలకాబోతున్న ‘మహర్షి’ సినిమా ప్రమోషన్స్ అప్పుడే మొదలుపెట్టినట్లు అనిపిస్తుంది.. ఇప్పుడు వదిలిన ‘మహర్షి’ వర్కింగ్ ఫొటోస్ చూస్తుంటే.

Tags:    

Similar News