అల్లూరి పాత్రకు మహేష్ ను ఎందుకు తీసుకోలేదు..?

రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ [more]

Update: 2019-03-15 06:20 GMT

రాజమౌళితో మహేష్ సినిమా ఉంటుంది కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. మరి రాజమౌళి బాహుబలి తర్వాత మహేష్ తో సినిమా చేస్తాడనుకున్నవారికి మాములుగా షాకివ్వలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మహేష్ ని పక్కనబెట్టేసి రాజమౌళి ఈ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ మొదలుపెట్టాడు. ఈ సినిమా ప్రెస్ మీట్ లో మహేష్ తో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేయిస్తే బాగుండేది… ఎలాగూ మహేష్ తండ్రి కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా చేసి సక్సెస్ సాధించారు. అందుకే ఈ సినిమాలో ఆ పాత్రకి మహేష్ ని పెట్టి ఉంటే కృష్ణ అభిమానులు ఆనందపడేవారు కదా అని రాజమౌళిని అడిగారు.

ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో…

అయితే, ఒకసారి ఏదో ఈవెంట్ లో మహేష్ ఫాన్స్ ని కలిసినప్పుడు మహేష్ ని అల్లూరి పాత్రలో చూడాలనుకుంటున్నారా లేదంటే జేమ్స్ బాండ్ తరహా పాత్రలోనా అని అడగగా.. వారు అల్లూరి కంటే ఎక్కువగా జేమ్స్ బాండ్ తరహా పాత్రకి రెస్సాన్స్ ఇచ్చారని రాజమౌళి చెప్పాడు. అందుకే మహేష్ ని ఈ #RRRలో తీసుకోలేదని చెప్పాడు. మరి మాములుగా జక్కన్న మనసులో అల్లూరి పాత్రని మహేష్ తోనే చేయించాలని అనుకున్నట్టుగా అనిపించలేదు. ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ సరిగా లేకపోవడంతో #RRR మల్టీస్టారర్ కి మహేష్ ని తీసుకోకుండా ఎన్టీఆర్, రామ్ చరణ్ ని తీసుకున్నాడన్న మాట.

Tags:    

Similar News