అనిల్ డైరెక్షన్ లో మహేష్..?

ఎఫ్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడికి గోల్డెన్ ఛాన్స్ దక్కబోతుందా..? సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం అనిల్ రావిపూడికి [more]

Update: 2019-01-19 07:34 GMT

ఎఫ్ 2 సినిమాతో డబుల్ హ్యాట్రిక్ కొట్టిన అనిల్ రావిపూడికి గోల్డెన్ ఛాన్స్ దక్కబోతుందా..? సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే అవకాశం అనిల్ రావిపూడికి వస్తుందంటున్నారు. మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ‘మహర్షి’ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే కథ రెడీ అయింది. అయితే సుకుమార్ తర్వాత అనిల్ తో సినిమా చెయ్యాలని అనుకుంటున్నాడు మహేష్. ఎఫ్ 2 సినిమా మహేష్ కు తెగ నచ్చేసింది. అయితే ఎఫ్ 2 సీక్వెల్ త్వరలో చేయబోతున్నాడు అనిల్. డీవీవీ దానయ్య బ్యానర్ లో మహేష్ తో అనిల్ ఓ సినిమా చేస్తారంటున్నారు టాలీవుడ్ ప్రముఖులు. అనిల్ ఇప్పటి నుండే వర్క్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు.. అనిల్ డైరెక్షన్ లోనే పూర్తిగా సినిమా ఉంటుందంటున్నారు. మరి ఈ ఇద్దరి సినిమా ఉందా లేక అనిల్ వేరే హీరోతో చేస్తున్నాడా అనేది మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది.

Tags:    

Similar News