మహేష్ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు..!

స్టార్ ఇమేజ్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు తీసేది దిల్ రాజు ఒక్కడే. ఎంత పెద్ద స్టార్ అయినా ఆయనకు అనవసరం. కథలో కంటెంట్ [more]

Update: 2019-02-15 06:43 GMT

స్టార్ ఇమేజ్ తో ఏ మాత్రం సంబంధం లేకుండా సినిమాలు తీసేది దిల్ రాజు ఒక్కడే. ఎంత పెద్ద స్టార్ అయినా ఆయనకు అనవసరం. కథలో కంటెంట్ ఉంటేనే సినిమా చేస్తాడు. ప్రస్తుతం మహేష్ 25వ చిత్రం మహర్షి తీస్తున్న దిల్ రాజు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చెప్పాడు. స్టోరీని ఎక్కడా రివీల్ చేయకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఈ సినిమా చూసి బయటకి ప్రతి ఒక్కరు బరువైన గుండెతో వస్తారని చెప్పారు. ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్రెండ్ షిప్ ఎమోషన్ చాలా అద్భుతంగా ఉంటాయట. ఈ సీన్స్ కి అందరూ కనెక్ట్ అవుతారని దిల్ రాజు చెబుతున్నాడు.

కథకు తగ్గ టైటిల్

ఇక సినిమాలో ఎక్కడా పొలిటికల్ టచ్ ఉండదని, సొసైటీకి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయని చెబుతున్నారు. ఈ మూవీ మహేష్ పర్సనల్ లైఫ్ కి దగ్గరగా ఉంటుందని.. మహర్షి అనే టైటిల్ కథకు తగ్గట్టుగానే ఉంటుందని దిల్ రాజు అన్నారు. ఈ మాటలు చెప్పిన తరువాత మహర్షిపై ఫ్యాన్స్ లో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఏప్రిల్ 25న మహర్షి రిలీజ్ అవుతోంది. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను దిల్ రాజుతో పాటు పీవీపీ, అశ్వినీ దత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News