తన అమ్మ గురించి మహేష్ ఇలా!

Update: 2018-04-20 05:11 GMT

ఈరోజు దేశవ్యాప్తంగా భరత్ అనే నేను సినిమా గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. కొరటాల - మహేష్ కాంబినేషన్ లో వస్తున్న రెండో చిత్రం కాబట్టి సినిమా చాలా అంచనాలు ఉన్నాయ్. అయితే ఈరోజు మహేష్ తన జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే ఈరోజు మహేష్ తల్లి ఇందిర జన్మదినం.

అమ్మ పుట్టిన రోజు.. సినిమా రిలీజ్ ఒకేరోజు రావడం కచ్చితంగా విశేషమే. అందుకే తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ తో పంచుకున్నాడు. తన తల్లి పాత ఫొటోను షేర్ చేస్తూ.. " ఈ ప్రత్యేకమైన రోజున నా హృదయానికి దగ్గరైన సినిమాను అందరి ముందుకు తీసుకురావడం చెప్పలేనంత ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్ డే అమ్మా. భరత్ అనే నేను ఇన్ సినిమాస్ నౌ’’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

ఇక భరత్ అనే నేను సినిమాలో ఫుల్ లెంగ్త్ పొలిటికల్ పాత్ర పోషించాడు మహేష్. ఇప్పటికే ఓపెనింగ్స్ కూడా ఒక రేంజ్ లో జరిగాయి అని ఫిలింనగర్ టాక్. సినిమా బ్లాక్ బస్టర్ అయితే రంగస్థలం కలెక్షన్స్ ని క్రాస్ చేస్తాడో లేదో చూడాలి.

Similar News