రష్మికకే పోటీ అంటున్న మహేష్ కూతురు

సరిలేరు నీకెవ్వరూ సినిమా సాంగ్స్ ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఒక్కో సోమవారం మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆ పాటల్లో దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయినా… మొన్న సోమవారం విడుదలైన [more]

Update: 2019-12-21 04:49 GMT

సరిలేరు నీకెవ్వరూ సినిమా సాంగ్స్ ప్రస్తుతం ఒక్కొక్కటిగా ఒక్కో సోమవారం మార్కెట్ లోకి వస్తున్నాయి. ఆ పాటల్లో దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ ఆకట్టుకోలేకపోయినా… మొన్న సోమవారం విడుదలైన హి ఈజ్ సో క్యూట్ సాంగ్ మాత్రం ట్రేండింగ్ లో ఉంది. కారణం ఆ సాంగ్ వీడియోలో హీరోయిన్ రష్మిక గ్లామర్ అండ్ క్యూట్ డాన్స్ అండ క్యూట్ ఎక్సప్రెషన్స్. రష్మిక మహేష్ ని ఆటపట్టిస్తూ వేసుకున్న ఆ డాన్స్ అండ్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. అయితే ఇప్పుడు రష్మిక ని యాజిటీజ్ గా దించేసింది మహేష్ ముద్దుల కూతురు సితార. సితార మంచి డాన్సర్ అనే విషయం చాలా సందర్భాల్లో యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బాహుబలి సాంగ్ తో పాటుగా.. మహర్షి సాంగ్ కి డాన్స్ వేసి అదరగొట్టిన సీతు పాప ఇప్పుడు మరోసారి మహేష్ సినిమా పాటకి డాన్స్ ఇరగదీసింది.

రష్మిక ముద్దుగా అల్లరిగా మహేష్ ని ఆటపట్టిస్తూ వేసిన డాన్స్ హి ఈజ్ సో క్యూట్ సాంగ్ ని సితార కూడా రష్మిక స్టెప్స్ ని యాజిటీజ్ గా దింపేసింది. సితార ముద్దుగా వేసిన సరిలేరు నీకెవ్వరూ హి ఈజ్ సో క్యూట్ సాంగ్ స్టెప్స్ అదిరిపోతున్నాయంటే నమ్మాలి. సితార రష్మిక కి తీసిపోకుండా వేసిన ఆ స్టెప్స్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్చల్ చేస్తున్నాయి. మరి సితార డాన్స్ చూసి మహేష్ మురిసిపోవడం ఏమో కానీ.. సీతు పాప డాన్స్ కి సినిమా ప్రియులు మాత్రం సలాం కొడుతున్నారు. ఎంతైనా సూపర్ స్టార్ కూతురు కదా.. అందుకే ఈ రేంజ్ పెరఫార్మెన్స్ అంటూ కొనియాడుతున్నారు.

Tags:    

Similar News