మహేష్ కాంప్లిమెంట్స్ కి పడిపోయిన దర్శకుడు

Update: 2018-06-16 06:40 GMT

నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సుధీర్ బాబు - ఇంద్రగంటి.. సమ్మోహనం ప్రేక్షకులను మాత్రమే సమ్మోహనం చేయడం కాదు, సినిమా ఇండస్ట్రీలోని పలువురిని, ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని కూడా సమ్మోహన పరిచింది. ముందు నుండి మహేష్ బాబు.. సమ్మోహనం కోసం పబ్లిసిటీ చేపట్టాడు. సమ్మోహనం సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కి రావడమే కాదు.. సినిమా విడుదలకు ముందు సమ్మోహనం హిట్ అవ్వాలని.. సుధీర్ బాబు, ఇంద్రగంటి, అదితి రావు, చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ కూడా చెప్పాడు. ఇక సినిమా కూడా మహేష్ కోరుకున్నట్టుగానే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రేక్షకులంతా సమ్మోహనాన్నికి పాజిటివ్ టాక్ ఇచ్చేశారు.

సినిమాపై ప్రశంసల జల్లు...

ఇంద్రగంటి మేకింగ్ స్టయిల్, అదితి అందాలు, సుధీర్ బాబు నటన సినిమాకు ప్లస్ మార్కులు పడిపోయాయి. ఇంకా సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ దగ్గర నుండి సినిమాటోగ్రఫీ వరకు ఈ సినిమా హిట్ కి కలిసొచ్చాయి. అయితే సమ్మోహనం సినిమా మొదటి రోజే వీక్షించిన మహేష్ బాబు.. దర్శకుడు ఇంద్రగంటి ని పొగడ్తలతో ముంచెత్తాడు. ఇంద్రగంటి మోహనకృష్ణ .. రచన, దర్శకత్వం రెండూ చాలా అందంగా ఆహ్లాదంగా సాగాయని.. టాలీవుడ్ ఇండస్ట్రీలోని గొప్ప ప్రతిభావంతులైన దర్శకుల్లో ఇంద్రగంటి ఒకడని మహేష్ కితాబునిచ్చేసాడు. అంతేకాకుండా సుధీర్ బాబు, అదితి రావు లు అత్యున్నత స్థాయి నటన కనబరిచారని.. వీళ్లిద్దరికీ ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు మహేష్.

ఫుల్ ఖుష్ లో ఇంద్రగంటి...

సమ్మోహనం సినిమా విజయంలో ఎక్కువ మార్కులు వేయించుకున్న సీనియర్ నరేష్ నటన గురించి కూడా మహేష్ ప్రత్యేకంగా మెచ్చుకున్నాడు. మరి మహేష్ సమ్మోహనం సినిమాకి, ఇంద్రగంటి కి ఇచ్చిన కాంప్లిమెంట్స్ తో ఇంద్రగంటి ఉబ్బి తబ్బిబ్బవుతున్నాడు. మరి తన కెరీర్ లో మహేష్ ఇచ్చిన కంప్లిమేట్స్ బెస్ట్ అని ఇంద్రగంటి చెబుతున్నాడు.. మరి సూపర్ స్టార్ ప్రశంసలా మజాకా...!

Similar News