మహేష్ అందుకే టెంప్ట్ అయ్యాడా?

మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి నిమిషానికి నానుతున్న సూపర్ హీరో. ఏ సినిమా హిట్ అయ్యో.. లేదంటే ఏ సినిమా మొదలెట్టొ… మహేష్ పేరు [more]

Update: 2020-03-01 14:41 GMT

మహేష్ బాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి నిమిషానికి నానుతున్న సూపర్ హీరో. ఏ సినిమా హిట్ అయ్యో.. లేదంటే ఏ సినిమా మొదలెట్టొ… మహేష్ పేరు సోషల్ మీడియాలో మోగడం లేదు. గత ఏడాది సుకుమార్ సినిమాకి కి బ్రేకప్ చెప్పి అందరికి షాకిచ్చిన మహేష్.. ఈ ఏడాది వంశి పైడిపల్లి సినిమాకి బ్రేకప్ చెప్పి మల్లి షాకిచ్చాడు. వంశీని తిప్పుకుని తిప్పుకుని చివరికి వద్దనేశాడు. అదలా ఉంటె మరోపక్క చిరు – కొరటాల సినిమాలో గెస్ట్ రోల్ అంటూ షాకిస్తున్నాడు. అది కూడా తన పాత్ర చనిపోతుంది అని తెలిసిన మహేష్ ఒప్పేసుకున్నాడనే న్యూస్ మహేష్ అభిమానులకు చమట్లు పట్టిస్తుంది.

అయితే మహేష్ చిరు మీద గౌరవం, కొరటాల మీద ఆభిమానం, పాత్ర మీద ప్రేమతో ఆ సినిమా ఒప్పుకోలేదు…. 30 నిమిషాలకి 30 కోట్లిస్తామని రామ్ చరణ్ తో పాటుగా మరో నిర్మాత నిరంజన్ రెడ్డి పెట్టిన ప్రపోజల్ కి మహేష్ టెంప్ట్ అయ్యి చిరు సినిమా ఒప్పేసుకున్నాడనే టాక్ బయలుదేరింది. రామ్ చరణ్ ఎంత ఫ్రెండ్ అయినా.. బిజినెస్ బిజినెస్సే… స్నేహం స్నేహమే అన్నట్టుగా మహేష్ అడిగింది ఇవ్వడానికి చరణ్ రెడీ అయ్యాడట. మరి మహేష్ 30 కోట్లకి ఓ గెస్ట్ రోల్ చెయ్యడమేమిటి.. నీ రేంజ్ కి ఇది తగునా అంటూ మహేష్ ఫ్యాన్స్ కి నీరసలోచ్చేస్తున్నాయి. మరి మహేష్ నిజంగానే టెంప్ట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాడంటారా..!

Tags:    

Similar News