మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు లుక్ లీకైంది

మహర్షి సినిమా ఇచ్చిన ఉత్సాహములో మహేష్ బాబు ఇప్పుడు మహర్షి తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే తన నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ ని అనిల్ రావిపూడి [more]

Update: 2019-07-08 07:51 GMT

మహర్షి సినిమా ఇచ్చిన ఉత్సాహములో మహేష్ బాబు ఇప్పుడు మహర్షి తర్వాత పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే తన నెక్స్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరూ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం మహేష్ – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సెట్స్ మీద ఫుల్ బిజీగా షూటింగ్ చేసుకుంటున్నారు. మొదటిసారి రష్మిక మందన్న మహేష్ బాబు తో జోడి కడుతున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో మహేష్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక సరిలేరు నీకెవ్వరు సినిమాలో అనిల్ రావిపూడి మార్క్ కామెడీ మిస్ కాకుండా కాశ్మిర్ నుండి ఆంధ్ర కి బయలుదేరే ట్రైన్ లో మహేష్ బాబు కమెడియన్స్ తో కలిసి కావాల్సినంత కామెడీ పండించబోతున్నాడనే న్యూస్ చక్కర్లు కొడుతోంది. దానికోసం అంటే ట్రైన్ ఎపిసోడ్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓ సెట్ కూడా వేస్తున్నారు.

అయితే మహేష్ బాబు మహర్షి సినిమాని మొదలెట్టిన కొత్తలో మహర్షి గా మహేష్ స్టూడెంట్ లుక్ ఒకటి లీకవడమే కాదు.. సామజిక మద్యమాల్లో ఆ లుక్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆతర్వాత టీం మళ్ళీ అలాంటి పొరబాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంది. ఇక తాజాగా సరిలేరు నెవ్వరు సినిమాలోని మహేష్ ఆర్మీ లుక్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో లీక్ అయ్యింది. మహేష్ తో పాటుగా మరికొంత మంది కూడా ఆర్మీ సోల్జర్స్ పాత్రధారులు కూడా ఈ ఫొటోలో కనిపిస్తున్నారు. ఆ లీకెడ్ పిక్ ఇప్పడు ఇంటర్నెట్ లో కొన్ని సెకన్స్ లోనే వైరల్ అయ్యింది. మహేష్ ఆర్మీ లుక్ లో భలేవున్నాడంటూ మహేష్ అభిమానులు తెగ పండగ చేసుకుంటున్నారు కూడా.

Tags:    

Similar News