ఆ విషయంలో ఫస్ట్ ప్లేస్ లో మహేష్..?

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ [more]

Update: 2019-03-16 06:36 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను నిర్మిస్తున్న ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ లో రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా మే 9న విడుదల అవుతుంది. ఈ సినిమా తరువాత మహేష్ తన 26వ సినిమాను కూడా లైన్ లో పెట్టేసాడు. మహేష్ 26వ సినిమా సుకుమార్ చేయాలని కానీ కొన్ని కారణాలు వల్ల అనిల్ రావిపూడి చేస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజుతో పాటు అనిల్ సుంకర నిర్మిచనున్నారు. మహర్షి తర్వాత దిల్ రాజు తెలివిగా మహేష్ ని లాక్ చేశారన్న మాట ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తోంది.

సౌత్ ఆఫ్రికాలో యాడ్ షూట్

ఇక ఇది పక్కన పెడితే మహేష్ ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వాణిజ్య ప్రకటనల్లోనూ నటించేస్తున్నారు. ప్రఖ్యాత కోలా బ్రాండ్ కి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ షూట్ కోసం మహేష్ రీసెంట్ గా సౌత్ ఆఫ్రికా వెళ్లారు. అక్కడ అడవుల్లో, అరుదైన లొకేషన్లలో ఈ ప్రకటనను చిత్రీకరిస్తున్నారట. అలా సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్కన ప్రకటనలతో భారీగా ఆర్జించే టాలీవుడ్ స్టార్ గా మహేష్ పేరు అగ్రపథంలో నిలుస్తోంది. అలా టాలీవుడ్ లోనే ఆదాయంలో మొదటి స్థానంలో నిలిచాడు.

Tags:    

Similar News