అంతా కొత్త బిజినెస్ లు పెడుతున్నారే

మన టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త బిజినెస్ ట్రెండ్ నడుస్తుంది. అదే బట్టల బిజినెస్ ట్రెండ్. ఇప్పుడు మన హీరోస్ అంత వరుసగా బట్టల వ్యాపారంలోకి దిగుతూ [more]

Update: 2019-07-31 08:23 GMT

మన టాలీవుడ్ లో ఇప్పుడు కొత్త బిజినెస్ ట్రెండ్ నడుస్తుంది. అదే బట్టల బిజినెస్ ట్రెండ్. ఇప్పుడు మన హీరోస్ అంత వరుసగా బట్టల వ్యాపారంలోకి దిగుతూ కొత్త ట్రెండ్ కి నాందిపలుకుతున్నారు. టాలీవుడ్ లో దీన్ని ముందు స్టార్ట్ చేసింది మాత్రం విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమాతో మంచి క్రేజ్ రావడంతో ఆయన ‘రౌడీ’ అనే పేరుతో ఆన్ లైన్ బట్టలు వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఇది పర్లేదు బాగానే నడుస్తుంది.

మహేష్ బాబు కూడా….

అలానే ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ టైంలో ప్రొడ్యూసర్ ఛార్మి అండ్ పూరి బి ఇస్మార్ట్ పేరుతో బట్టలు బిజినెస్ స్టార్ట్ చేసారు. ఇక రీసెంట్ గా మహేష్ బాబు కూడా ఈ బిజినెస్ లోకి దిగనున్నాడు. రెండు రోజుల క్రితం ‘ది హంబుల్ కో ‘ బ్రాండ్ నేమ్ తో అప్పెరల్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. అలానే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఆన్ లైన్ బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తునట్టు సమాచారం అందుతుంది. దీనికి ‘స్టార్’ అనే పేరు పెట్టారు.

సల్మాన్ తో మొదలయి…..

అసలు ఈ ట్రెండ్ ని బాలీవుడ్ లో సల్మాన్ మొదలుపెట్టారు. ‘బీయింగ్ హ్యూమన్’ పేరుతో ఆయన స్టార్ట్ చేసిన బ్రాండ్ సూపర్ సక్సెస్ అయ్యింది. అది మెల్లగా మన టాలీవుడ్ కి పాకింది. ఇలా మన హీరోస్ తెలివిగా తన ఇమేజ్ ని కాష్ చేసుకుంటూ వ్యాపారం కొరకు ఉపయోగించుకుంటున్నారు.

Tags:    

Similar News