మహేష్ సినిమా స్టోరీ ఇదేనా..?

వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవ్వడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుండి కూడా అనిల్ [more]

Update: 2019-02-06 07:58 GMT

వరుసగా నాలుగు సినిమాలు హిట్ అవ్వడంతో డైరెక్టర్ అనిల్ రావిపూడికి పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తున్నాయి. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుండి కూడా అనిల్ కు ఆఫర్ వచ్చింది. మహేష్ నటించిన దూకుడు, ఆగడు సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన అనిల్ తో మహేష్ సినిమా చేద్దాం కథ రెడీ చేయి అని చెప్పాడట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అనిల్.. మహేష్ తో ఎటువంటి సినిమా తీస్తాడనేదే అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం.

పోలీస్ పాత్రకు ఒప్పుకుంటాడా..?

అనిల్ కు మంచి కామెడీ టైమింగ్ ఉంది కాబట్టి మహేష్ తో కూడా కామెడీ నేపథ్యంలో సాగే సినిమా తీస్తాడా? లేదా ఆగడు లాగా పోలీస్ యాక్షన్ సినిమా తీస్తాడా? అనేది చూడాల్సిన విషయం. అనిల్ దగ్గర మాఫియా, పోలీస్ నేపథ్యంలో సాగే చాలా కథలు ఉన్నాయంట. వాటిలో ఒకటి మహేష్‌ కోసం దించుతాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. అయితే మహేష్ మాత్రం ఆగడు తరువాత నుండి పోలీస్ పాత్రలంటే పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. చూద్దాం మరి వీరి దగ్గర ఎటువంటి సినిమా వస్తుందో…

Tags:    

Similar News