తెలుగు సినిమాలనే కాపీ కొడుతున్నారా?

ఈమధ్యన ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా… ఏ సినిమా విడుదలైనా… వెంటనే ఏదో ఒక భాషకి సంబందించిన సినిమాని కాపీ చేసారంటూ వెంటనే మీడియాలో న్యూస్ [more]

Update: 2019-06-01 06:53 GMT

ఈమధ్యన ఏ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినా… ఏ సినిమా విడుదలైనా… వెంటనే ఏదో ఒక భాషకి సంబందించిన సినిమాని కాపీ చేసారంటూ వెంటనే మీడియాలో న్యూస్ లు వచ్చేస్తాయి. ఇక మన దర్శకులు అరబిక్, ఫ్రెంచ్ సినిమాలను కూడా వదలరు. ఆ సినిమాల్లో ఏ సీన్ అయినా ఇంప్రెస్సింగ్ గా అనిపిస్తే చాలు ఆ సీన్స్ ని తమ సినిమాల్లో వాడేస్తారు. అయినా ప్రేక్షకులకు నచ్చింది అంటే అది ఏ సినిమా నుండి దర్శకులు కాపీ కొట్టారో అనేది చూడరు. ఆ సినిమా నచ్చలేదు అంటేనే క్రిటిక్స్ తో పాటుగా ప్రేక్షకులు సోషల్ మీడియాలో ఆడేసుకుంటారు. సరే ఇదంతా ఇప్పుడెందుకంటే…. నిన్న శుక్రవారం క్రేజీగా మొదలైన మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే సరిలేరు నీకేవారు సినిమా కథ ఇదే అనడమే కాదు… ఆ కథ ఏ ఏ సినిమాల నుండి కాపీ కొడుతున్నారో కూడా ప్రచారం చేస్తున్నారు.

దర్శకుడు అనిల్ రావిపూడి ఏ ఫ్రెంచ్, ఏ బాలీవుడ్ మూవీ నుండో ఇన్స్పైర్ అవకుండా ఏకంగా తెలుగు మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి ఈ సరిలేరు నీకెవ్వరు అనే కథ రాసుకుని.. దాన్ని ఎంటెర్టైనెర్ గా మలిచాడనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. గతంలో వెంకటేష్ నటించిన వారసుడొచ్చాడు, మహేష్ బాబు నటించిన అతడు నుంచి అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ కథ తీసుకున్నాడంటున్నారు. ఆ రెండు సినిమాల్లోలాగానే ఈ సినిమాలో హీరో కూడా తనతో కలిసి ఆర్మీలో పని చేసే ఓ స్నేహితుడి ఇంటికి వెళ్లాల్సిన పని పడుతుందిట. ఆ స్నేహితుడు చనిపోయాడనే వార్త చెప్పడానికి ఆ స్నేహితుడు ఇంటికి రాగ… అక్కడ పరిస్థితులను బట్టి అదే ఇంట్లో కొన్నాళ్ల పటు ఉండాల్సిన అవసరం ఏర్పడుతుందట. ఆ క్రమంలో తన స్నేహితుడు ఫ్యామిలీకి ఊరుకి సహాయం చేయడం వంటి కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారట. మరి ఈ న్యూస్ లో నిజమెంతుందో తెలియదు కానీ… ఈ న్యూస్ మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

Tags:    

Similar News