మహేష్ అనుకున్నది అదే..!

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే మూవీ ఓపెనింగ్ రేపే అంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూనే. కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ కొత్త సినిమా [more]

Update: 2019-05-30 13:30 GMT

మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే మూవీ ఓపెనింగ్ రేపే అంటూ ఎప్పటి నుండో ప్రచారం జరుగుతూనే. కృష్ణ పుట్టినరోజు కానుకగా మహేష్ కొత్త సినిమా మొదలవుతుందని… ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జూన్ 26 నుండి మొదలు కాబోతుందనే ప్రచారం ఉంది. ఇక కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి సరిలేరు నీకెవ్వరూ, రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్స్ లో ఏదో ఒక టైటిల్ పెడుతున్నారంటూ ప్రచారం జరుగుతుండగా… మహేష్ మాత్రం సాఫ్ట్ టైటిల్ అయిన సరిలేరు నీకెవ్వరూ అనే టైటిల్ కే మొగ్గు చూపినట్లుగా వార్తలొస్తున్నాయి. అదే టైటిల్ ని మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లుగా చెబుతున్నారు.

మళ్లీ దేవీశ్రీ కే ఛాన్స్

మరో పక్క మహర్షి సినిమాకి ఆకట్టుకోలేని మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ కే మరోసారి మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ ఇస్తున్నారనే న్యూస్ కూడా హైలెట్ అయ్యింది. ముందుగా మహర్షి సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇవ్వలేదని మహేష్ అభిమానులు గుర్రగా ఉన్నారు. ఇక మహేష్ 26 మూవీకి దేవిశ్రీ వద్దని మహేష్ అభిమానులు మొరపెట్టుకున్నప్పటికీ.. మహేష్ తో పాటు అనిల్ రావిపూడి కూడా దేవిశ్రీ కే మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. అనిల్ సుంకర నిర్మిస్తోన్న ఈ సినిమాను 6 నెలల్లో పూర్తిచేసి 2020 సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

Tags:    

Similar News