అనిల్ – మహేష్ మూవీ టైటిల్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి రాబోతుంది. దిల్ రాజు అండ్ అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న [more]

Update: 2019-05-27 09:08 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు – అనిల్ రావిపూడి డైరెక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ ఒకటి రాబోతుంది. దిల్ రాజు అండ్ అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాను మొదటినుండి ‘రెడ్డిగారి అబ్బాయ్’ అనే టైటిల్ చక్కర్లు కొట్టింది. అయితే ఇది నిజం కాదని తెలిసింది.

ఇన్సైడ్ టాక్ ప్రకారం ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ ను అనుకుంటున్నారట మేకర్స్. అయితే ఇది పుకార్లు కావు. అదే నిజం. అవును.. మహేష్ కొత్త సినిమాకు ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ పెట్టబోతున్నారు. ఈవిషయాన్ని స్వయంగా అనిల్ రావిపూడి రివీల్ చేసాడు. రీసెంట్ గా స్క్రిప్ట్ కి సంబంధించి పనులు పూర్తి చేసాడు అనిల్. ఈ విషయాన్నీ అనిల్ ఇండైరెక్ట్ గా తన ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొన్నాడు. ఇక ఆఫ్-ది-రికార్డు టైటిల్ కూడా మీడియాకు చెప్పేశాడు.

ఇక ఇందులో సిల్వర్ స్క్రీన్ పై రీఎంట్రీ ఇస్తున్నారు బండ్ల గణేశ్ అండ్ విజయశాంతి. మహేష్ కి జోడిగా రష్మిక హీరోయిన్ గా నటించనుంది. తన ఫ్యామిలీతో ట్రిప్ కి వెళ్లిన మహేష్ తిరిగి రాగానే ఈసినిమా లాంఛ్ చేయనున్నారు. రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ కానుంది

Tags:    

Similar News