మహేష్ – అనిల్ మూవీ ముహూర్తం ఫిక్స్!

డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకున్న మహేష్ బాబు 25 ఫిలిం మహర్షి బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న [more]

Update: 2019-05-29 07:33 GMT

డివైడ్ టాక్ తో పర్లేదు అనిపించుకున్న మహేష్ బాబు 25 ఫిలిం మహర్షి బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫామ్ చేసింది. ప్రస్తుతం సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ మూవీ చేయనున్నాడు. దీన్ని అనిల్ రావిపూడి మహర్షి సక్సెస్ మీట్ లో ప్రకటించాడు.

ఎఫ్ 2తో హిట్ అందుకుని…..

ఎఫ్ 2 తో హిట్ అందుకున్న అనిల్.. మహేష్ కోసం ఓ మంచి లైన్ అనుకుని అతని చెప్పేసి ఓకే చేయించుకున్నాడు. తరువాత స్క్రిప్ట్ మీద ద్రుష్టి పెట్టినా అనిల్ ఇటీవలే బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని మహేష్ కూడా చెప్పేశాడట. అంత ఓకే నే కానీ సినిమా ఎప్పుడు లాంచ్ అనేది తెలియదు. అయితే దానికి మంచి డేట్ ఫిక్స్ చేసుకున్నారు మేకర్స్.

కృష‌్ణ పుట్టిన రోజు నాడు…..

ఈ నెల 31న మహేష్ తండ్రి కృష్ణ గారి పుట్టిన రోజు సందర్భంగా మహేష్ ఈ సినిమాను మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈరోజో రేపో మహేష్ వెకేషన్ ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకోబోతున్నాడట. శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిపించేసి.. ఎండలు కొంచెం తగ్గాక చిత్రీకరణ మొదలుపెట్టనున్నారట. ఇక ఇందులో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతి నటిస్తున్నారు. హీరోయిన్ గా రష్మిక ఓకే అయింది. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్తంగా ఈమూవీని నిర్మిస్తున్నారు. ఇది రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ అని అర్ధం అవుతుంది.lĺ

Tags:    

Similar News