వీరి పరిస్థితి ఏంటి?

Update: 2018-04-05 02:12 GMT

టాలీవుడ్ లో సంక్రాంతికి వచ్చిన సినిమాలు నిరాశకు గురి చేసిన ఈ సమ్మర్ స్టార్టింగ్ లో వచ్చిన భారీ చిత్రాల్లో రంగస్థలం అంచనాల్ని మించిన విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి వారంలోనే 50 కోట్ల షేర్ సాధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్టయ్యే దిశగా పరుగులు పెడుతోంది. చరణ్ ‘మగధీర’ సినిమాను క్రాస్ చేయడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తానికి చరణ్ బాక్స్ ఆఫీస్ వద్ద తన రియల్ పవర్ ను చూపిస్తున్నాడు. ఇంకా తర్వాత వచ్చే మహేష్ బాబు.. అల్లు అర్జున్ ల సంగతే తేలాల్సి ఉంది.

భరత్ అనే నేను.. నా పేరు సూర్య సినిమాలు ఈ సమ్మర్ లో బిగ్ ఫిలిమ్స్. ఈ సినిమాలపై మార్కెట్ లో భారీ అంచనాలు ఉన్నాయి. అంచనాలు తగ్గట్టు సినిమాలు ఉంటే వారి కెరీర్లో అతి పెద్ద హిట్లుగా నిలవడం అలానే వసూల్ పరంగా రికార్డ్స్ నమోదు అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ఏప్రిల్ 20న మహేష్ బాబు.. భరత్ అనే నేనుతో మన ముందుకు వస్తున్నాడు. కొరటాల - మహేష్ కాంబినేషన్ కాబట్టి సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు నాన్ బాహుబలి రికార్డులు నెలకొల్పడంతో ‘భరత్ అనే నేను’పై కాన్ఫిడెన్స్ పెంచుతోంది.

ఇక అల్లు అర్జున్ - వంశీ కాంబినేషన్ కొత్త అయ్యినప్పటికీ సినిమా టీజర్ అండ్ సాంగ్ ప్రోమోస్ ద్వారా సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. రైటర్ గా చాలా బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన వక్కంతం వంశీ డైరెక్టర్ గా తాను తీస్తున్న తొలి సినిమా విషయంలో మరింత శ్రద్ధ పెట్టి ఉంటాడని.. ఈ సినిమా కూడా నిరాశ పరచదని అభిమానులు ఆశతో ఉన్నారు. మరి ఓవర్ ఆల్ గా ఈ సమ్మర్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవుతారో చూడాలి.

Similar News