మహేష్, అల్లరి నరేష్ స్నేహుతులా..?

Update: 2018-05-28 10:21 GMT

భరత్ అనే నేను సూపర్ హిట్ అవడంతో మహెష్ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. ఒక నెల నుండి ఫ్యామిలీతో వేసవి సెలవల్ని ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు త్వరలోనే వంశీ పైడిపల్లితో తన 25 వ చిత్ర షూటింగ్ తో సెట్స్ మీదకి వెళ్లబోతున్నాడు. అది జూన్ మొదటి వారంలో జరగొచ్చని సమాచారం ఉంది. మొదటిసారి పూజ హెగ్డే తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు ఈ సినిమా కోసం ఒక సరికొత్త లుక్ లోకి మారిపోనున్నాడు. ఎప్పుడూ క్లిన్ షేవ్ తో అందంగా కనబడే మహేష్ బాబు ఇప్పుడు తన 25 వ చిత్రం కోసం గెడ్డం పెంచుతున్నాడనే ప్రచారం ఉంది. అలాగే ఈ చిత్రం కోసం మహేష్ తన స్టయిల్ ని కూడా మార్చుకోబుతున్నాడనే టాక్ కూడా ఉంది.

హిట్లు లేకపోవడంతో...

అయితే మహేష్ 25 వ చిత్రంలో ప్రస్తుతం ఫామ్ లోలేని ఒక టాలీవుడ్ హీరో కూడా నటించబోతున్నాడు. ఎప్పుడూ కామెడీ చేస్తూ నవ్వించే అల్లరి నరేష్ మహేష్ సినిమాలో ఒక కీలక పాత్ర చెయ్యబోతున్నాడు. అయితే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఎలాంటి పాత్రలో నటిస్తున్నాడా అనే క్యూరియాసిటీ మహేష్ ఫాన్స్ తో పాటు అందరిలోనూ ఉంది. మరి ఒకప్పుడు కామెడీ హీరోగా హిట్స్ అందుకున్న అల్లరి నరేష్ కి ప్రస్తుతం చేతిలో సినిమాలేవీ లేవు. కారణం వరుసగా ఆయన సినిమాలన్నీ పరాజయం పాలవడమే. అందుకే మహేష్ సినిమాలో కీ రోల్ ప్లే చెయ్యడానికి అల్లరి ఒప్పుకున్నాడు.

మహేశ్ కి స్నేహితుడిగానే...

అయితే అల్లరి నరేష్ మహేష్ సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చెయ్యబోతున్నాడోతెలుసా.. మహేష్ కి స్నేహితుడిగా సినిమా కథని మలుపు తిప్పబోయే పాత్రలో కనిపించబోతున్నట్టుగా సోషల్ మీడియా టాక్. ఈ సినిమా కథలో నరేష్ పాత్రకి ఎక్కువ నిడివి ఉండడంతో పాటుగా.. అల్లరి నరేష్ ,పాత్రకి మహేష్ బాబు తో సమానమైన ప్రాధాన్యత కాకపోయినా.. కొద్దిగా తక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తుండగా.. దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Similar News