మహేష్ బాబుకు యాక్టింగ్ రాదు

Update: 2018-09-14 09:45 GMT

ఏదైనా రంగంలోకి కొత్తగా వచ్చేవారు ఆయా రంగంలో ఉన్న సీనియర్లు, పేరున్న వారిపై వివాదాస్పద కామెంట్లు చేసి ఫేమస్ అవుతుంటారు. ఇది ఒకరకమైన ప్రచార ఎత్తుగడ. తాజాగా, తమిళనాట కమెడియన్ గా ఇప్పుడిప్పుడే వస్తోన్న మనోజ్ ప్రభాకర్ అనే వ్యక్తి సరిగ్గా ఇదే ఫార్ములా ఫాలో అయ్యాడు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న అతడు... స్పైడర్ సినిమాలో ఎస్.జే.సూర్య నటనకు కితాబిచ్చారు. వాస్తవానికి ఎస్.జే.సూర్య ఈ సినిమాలో విలక్షణ నటనతో ఎంతో ఆకట్టుకున్నాడు.

కత్రినాకు మేల్ వర్షన్...

అయితే, ఇంతటితో ఊరుకోను మనోజ్ ప్రభాకర్ స్పైడర్ సినిమా హీరో మహేష్ బాబుపై వ్యాఖ్యలు చేశాడు. హీరోయిన్లలో కత్రినా కైఫ్ కి యాక్టింగ్ రాదని, మహేష్ బాబు కత్రినాకు మేల్ వర్షన్ అని అన్నాడు. ఎస్.జే.సూర్య నటనను మహేష్ చూస్తూ ఉండిపోయాడని, ముఖంగా ఎలాంటి ఎక్స్ ప్రెషన్స్ పలికించలేక రాళ్ల మాదిరిగా ఉన్నాడని విమర్శించారు. దీంతో మహేష్ అభిమానులకు మనోజ్ ప్రభాకర్ పై కొపం నశాలానికి ఎక్కింది. సోషల్ మీడియా వేదికగా అతడిపై విమర్శలకు దిగుతున్నారు. అయితే, బాలనటుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు స్టార్ హీరోగా ఎదిగి ఎన్నో అవార్డులు, ప్రశంసలు అందుకున్న విషయం వేరే చెప్పక్కర్లేదు.

Similar News