మహేష్ 26వ‌ మూవీ ఎప్పటి నుండి..?

సూపర్ స్టార్ మహేష్ మహర్షి మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి సినిమా అని క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. సినిమాలో అక్కడక్కడా బోర్ అనిపించినా ఓవరాల్ గా [more]

Update: 2019-05-10 08:48 GMT

సూపర్ స్టార్ మహేష్ మహర్షి మూవీకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి సినిమా అని క్రిటిక్స్ సైతం మెచ్చుకుంటున్నారు. సినిమాలో అక్కడక్కడా బోర్ అనిపించినా ఓవరాల్ గా మంచి చిత్రం అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లను దక్కించుకుని మిలియన్ డాలర్ క్లబ్ వైపు వెళుతోందని తెలుస్తోంది. అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్ల‌ని సాదిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తుంది.

మ‌హ‌ర్షి హ‌డావుడి త‌ర్వాతే

ప్రస్తుతం మహేష్ అండ్ టీం మహర్షి సక్సెస్ లో ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఒక వారం రోజుల పాటు సినిమాకి సంబంధించి ప్రమోషన్స్, పార్టీలు ఇతరత్రా సంగతులతోనే సరిపోతుంది కాబట్టి త‌ర్వాతే #MAHESH26 పై మహేష్ దృష్టి మళ్లిస్తాడని తెలుస్తోంది. మహేష్ నెక్స్ట్ అనిల్ రావిపూడితో చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ అనిల్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు టాక్. ప్రస్తుతం అనిల్ సినిమాలో కథానాయికల్ని.. ఇతర కీలక పాత్రధారుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. జూన్ 15 నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ని జరుకుకోనుంది.

విజ‌య‌శాంతి, బండ్ల గ‌ణేష్ కూడా…

ఇక ఇప్పటికే ఇందులో ఓ కీలక పాత్ర కోసం మహేష్ కు అత్తగా అలనాటి హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయగా.. అలాగే ఇందులో నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ ఓ హిలేరియస్ కామెడీ రోల్ లో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. ఒక హీరోయిన్ గా రష్మిక మందన్న‌ను ఫైనల్ చేసారు. ఇది పక్కా యాక్షన్ క్లీన్ ఎంటర్ టైనర్ అని మహేష్ ఆల్రెడీ చెప్పాడు. ఈ మూవీని దిల్ రాజుతో పాటు ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News