చిరు స్టేట్ రౌడీ టైటిల్ మహేష్ కా?

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో ఈ ఏడాది మొదట్లోనే ఓ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ వంశి సినిమానే [more]

Update: 2020-12-12 05:23 GMT

మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో ఈ ఏడాది మొదట్లోనే ఓ సినిమా స్టార్ట్ కావాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరూ తర్వాత మహేష్ వంశి సినిమానే చెయ్యాల్సి ఉండగా.. మహేష్ కి వంశి చెప్పిన కథ నచ్చక ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు.  వంశి చెప్పిన కథ నచ్చక మహేష్ పరశురామ్ తో సర్కారు వారి పాట చేస్తున్నాడు. అయితే తాజాగా మహేష్ బాబు – వంశి పైడిపల్లి కాంబోలో ఓ మూవీ రాబోతుంది అని..  పరశురామ్ సర్కారు వారి పాట పూర్తవగానే వంశి – మహేష్ మూవీ మొదలు కానుందనేది సోషల్ మీడియా టాక్. 

అయితే వంశి పైడిపల్లి మహేష్ తో చెయ్యబోయే సినిమాలో రఫ్ గా రౌడీ లుక్ లో చూపించబోతున్నాడట. మరి 40 ఏళ్ళు దాటినా క్యూట్ గా హ్యాండ్ సమ్ గ ఉండే మహేష్ రఫ్ గా విలన్స్ ని చితకబాదడం ఓకె కానీ.. గెడ్డం పెంచి, హెయిర్ పెంచి మరీ రఫ్ గా కనబడితే కష్టం. వంశి సినిమాలో మహేష్ ఊర మాస్ గా కనిపిస్తాడని.. దానికి తగిన టైటిల్ ని చిరు బ్లాక్ బస్టర్ మూవీ అయిన స్టేట్ రౌడీ టైటిల్ ని అనుకుంటున్నారట. చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన స్టేట్ రౌడీ టైటిల్ తో మహేష్ దుమ్ములేపడం ఖాయమని మహేష్ ఫాన్స్ అంటున్నారు. కానీ ఇదంతా కేవలం రూమర్ అంటూ కొట్టిపారేస్తున్నారు.

Tags:    

Similar News