మహేష్ సినిమాపై అప్పుడే మొదలా..?

మహేష్ తో రాజమౌళి ఇది ఫిక్స్. అది ఎవరైన చెబితే నమ్మేవాళ్లే కాదు… కానీ రాజమౌళి స్వయంగా చెప్పాడు కాబట్టి.. RRR తర్వాత మహేష్ తో రాజమౌళి [more]

Update: 2020-04-19 07:33 GMT

మహేష్ తో రాజమౌళి ఇది ఫిక్స్. అది ఎవరైన చెబితే నమ్మేవాళ్లే కాదు… కానీ రాజమౌళి స్వయంగా చెప్పాడు కాబట్టి.. RRR తర్వాత మహేష్ తో రాజమౌళి మూవీ పక్కా అన్నమాట. అందుకే మహేష్ ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ని రిజెక్ట్ చేస్తున్నాడా? వంశి పైడిపల్లి మూవీ స్క్రిప్ట్ నచ్చక సినిమా చెయ్యడం లేదు. మరోపక్క పరశురామ్ తో సినిమా అటు ఇటు గా ఉంది. రాజమౌళి RRR తో ఫ్రీ అయ్యేవరకు మహేష్ ఏ దర్శకుడి కథ ఒప్పుకునేలా లేడు అంటున్నారు.

మరి రాజమౌళి తో మహేష్ సినిమా అన్నాక ఆ సినిమాపై రకరకాల న్యూస్ లు సోషల్ మీడియాలో రాజ్యమేలడం ఖాయం. అసలు మహేష్ రాజమౌళి పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నాడా? లేదా? రాజమౌళి ముందే మహేష్ కి కథ సిద్ధం చేసి.. మూవీ గురించి లీకులిస్తున్నాడా? మహేష్ ని రాజమౌళి తాను చెప్పినట్టుగానే జేమ్స్ బాండ్ గా చూపించబోతున్నాడా? గతంలో రాజమౌళి మహేష్ తో తీస్తే గీస్తే జెమ్స్ బాండ్ త‌ర‌హా పాత్ర‌లో మహేష్ సినిమా ఉంటుంది? అన్నట్టుగా అలాంటిదే ప్లాన్ చేస్తున్నాడా? మరి అప్పుడు అన్నమాట రాజమౌళి నిజం చేస్తాడా? లేదంటే కొత్త కథ తో.. కొత్తగా మహేష్ ని చూపిస్తాడా? ఎలా చూపించినా రాజమౌళి తో మహేష్ సినిమా చేస్తే చాలు అంటున్నారు మహేష్ ఫాన్స్.

Tags:    

Similar News