అద‌ర‌గొట్టే పార్టీలో మ‌హేష్‌, విజ‌య్..!

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ లో భార్యాపిల్ల‌ల‌తో ఎంతగా సంతోషంగా ఉంటాడో కెరీర్ లో తనతో పనిచేసే సినిమా యూనిట్ అందరితోనూ అంతే మంచి [more]

Update: 2019-05-10 06:44 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు పర్సనల్ లైఫ్ లో భార్యాపిల్ల‌ల‌తో ఎంతగా సంతోషంగా ఉంటాడో కెరీర్ లో తనతో పనిచేసే సినిమా యూనిట్ అందరితోనూ అంతే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తాడు. ఇక తన సినిమా ఈవెంట్స్ జరిగాక సినిమా యూనిట్ లోని ముఖ్యమైన వాళ్లకు తన ఇంటి దగ్గరే మంచి పార్టీ ఆరెంజ్ చెయ్యడం మహేష్ కి అలవాటు. గత ఏడాది భారత్ అనే నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగాక ఎన్టీఆర్, రామ్ చరణ్, సందీప్ వంగా, కొరటాల శివ, వంశీ పైడిపల్లి లాంటి ప్రముఖులకు మహేష్ తన ఇంట్లోనే పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మహర్షి సినిమా విడుదలై సక్సెస్ సాధించినందుకుగానూ మహేష్ మరోసారి తన ఇంట్లో పార్టీ చేసుకుని మరీ ఎంజాయ్ చేసాడు. గత ఏడాది ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో పార్టీలో ఎంజాయ్ చేసిన మహేష్ బాబు ఈసారి విజయ్ దేవరకొండతో పార్టీ చేసుకున్నాడు.

స్పెష‌ల్ అపియ‌రెన్స్ ఇచ్చిన విజ‌య్

మహర్షి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి విజయ్ దేవరకొండ అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఇక సందీప్ వంగాతో మహేష్ సినిమా చేస్తార‌ని, ఈ సినిమాను విజయ్ దేవరకొండ నిర్మిస్తారని ప్రచారం జరుగుతున్నవేళ విజయ్ దేవరకొండ పదే పదే మహేష్ ని కలవడం మాత్రం ఆశ్చర్యకరంగానే ఉంది. ఇక మహర్షి విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సందర్భంగా మహేష్ ఏర్పాటు చేసిన ఆ పార్టీలో విజయ్ దేవరకొండ, దిల్ రాజు, మహర్షి హీరోయిన్ పూజ హెగ్డే, మహేష్ వైఫ్ నమ్రత, అశ్వినీదత్, పీవీపీ, వంశీ పైడిపల్లి లాంటి ప్రముఖులు పాల్గొన్నారు. ఇక నిన్న విజయ్ దేవరకొండ బర్త్ డే కూడా ఈ పార్టీకి కలిసొచ్చింది. మరి మహేష్ ఇచ్చిన పార్టీలో అందరూ ఎంజాయ్ చెయ్యడమే కాదు ఫొటోస్, సెల్ఫీస్ తో అదరగొట్టేశారని.. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఫొటోస్ చూస్తుంటే తెలుస్తుంది.

Tags:    

Similar News