మహేష్ 25వ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

Update: 2018-07-02 06:53 GMT

ప్రస్తుతం డైరెక్టర్ వంశీ పైడిపల్లి - మహేష్ కాంబినేషన్ లో మహేష్ 25 వ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్ బాబు ఎంబీఏ స్టూడెంట్ గా నటిస్తున్నాడు. లేటెస్ట్ గా మహేష్ బాబు లుక్ రిలీజ్ అవ్వడంతో ఈ చిత్రంపై మరింత అంచనాలు పెరిగాయి. ఇందులో ఒక కీలక పాత్రలో అల్లరి నరేష్ నటిస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా వేసవికి విడుదల కానుందని గతంలోనే తెలియగా ఇప్పుడు ఏప్రిల్ 5వ తేదీన విడుదలయ్యే అవకాశాలున్నట్టు సమాచారం.

సెంటిమెంట్ కోసమేనా...

అయితే ఇలా ప్రత్యేకించి ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకోవటం వెనుక ఒక బలమైన కారణమే ఉందట. మహేష్ ను ఒక స్థాయిలో నిలబెట్టిన 'పోకిరి', మళ్లీ అంతే స్థాయిలో నిలబెట్టిన ‘భరత్ అనే నేను’ ఈ రెండూ సినిమాలు ఏప్రిల్ నెలలోనే విడులయ్యాయి. అందుకే ఏప్రిల్ సెంటిమెంట్ తో ఈ చిత్రాన్ని కూడా ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలని భావిస్తున్నారు మహేష్, నిర్మాతలు. అయితే ఈ వార్తపై ఇంకా అధికారిక కన్ఫర్మేషన్ అందాల్సి ఉంది. ఈ చిత్రాన్ని దిల్ రాజుతో పాటు అశ్విన్ దత్, పీవీపీలు కలిసి నిర్మిస్తున్నారు.

Similar News