మహేష్ 25 వ సినిమా టైటిల్ ఇదే..

Update: 2018-05-30 02:11 GMT

బ్రహ్మ్మోత్సవం, స్పైడర్ రెండు డిజాస్టర్స్ తో చాలా ఇబ్బందులు పడిన మహేష్ బాబుని కొరటాల శివ.. భరత్ అనే నేను తో ఒడ్డున పడేసాడు. భరత్ అనే నేను బంపర్ హిట్ అవడమే కాదు మహేష్ బాబు రేంజ్ ని మరింత పెంచింది. ఇక భరత్ సినిమా హవా థియేటర్స్ లో ముగియడం, భారీ కలెక్షన్స్ కొల్లగొట్టడంతో, మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ప్రస్తుతం మహేష్ బాబు తన కెరీర్ లో మైలు రాయి అయిన 25 వ చిత్రాన్ని వంశి పైడిపల్లి డైరెక్షన్ లో చేయనున్నాడు. ఈ సినిమాలో కొత్త లుక్ తో మహేష్ గెడ్డం పెంచి కనబడతాడనే ప్రచారం జరుగుతుంది.

‘రాజసం’గా టైటిల్..

మహేష్ కెరీర్ లో ముఖ్యమైన ఈ సినిమా కోసం వంశి పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఇక వంశి పైడిపల్లి - మహేష్ సినిమాకు రాజసం అనే టైటిల్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వంశి.. మహేష్ కోసం రాజసం అనే టైటిల్ ని సెట్ చేసాడని..దీనికి మహేష్ కూడా సుఖంగా ఉన్నాడనే ప్రచారం అటు ఫిలిం సర్కిల్స్ లో, ఇటు సోషల్ మీడియా లోనూ ఒక రేంజ్ లో జరుగుతుంది. రాజసం కథకు సరిపడానే.. మహేష్ బాబు గెడ్డం పెంచుతున్నాడని... అలాగే ఈ సినిమా లో కొత్త మహేష్ ని చూడడం

ఖాయమంటున్నారు.

మహేశ్ స్నేహితుడిగా అల్లరి...

మరి వంశి పైడిపల్లి, మహేశ్ బాబు అభిమానులకి పూర్తిస్థాయిలో సంతృప్తిని కలిగించేలా ఈ సినిమా కథను తీర్చిదిద్దాడని.. ఈ సినిమాతో మహేష్ హిట్ అందుకోవడం ఖాయమంటున్నారు. ఇకపోతే ఈ సినిమాలో మహేష్ స్నేహితుడిగా అల్లరి నరేష్ నటిస్తుండగా..దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ లు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Similar News