రెండిటికి మధ్య తేడాలు.. పోలికలు

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగుతుంటే అందరూ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా, అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. రజినీకాంత్ దర్బార్, [more]

Update: 2020-01-08 06:20 GMT

ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు బరిలోకి దిగుతుంటే అందరూ మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమా, అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురములో సినిమా ముచ్చట్లే మాట్లాడుకుంటున్నారు. రజినీకాంత్ దర్బార్, కళ్యాణ్ రామ్ ఎంతమంచివాడవురా సినిమాలు అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదుకానీ.. సరిలేరు, అల సినిమాలపై మాత్రం ప్రేక్షకుల ఆసక్తి కనబడుతుంది . ఒకరోజు తేడా తో విడుదలవుతున్న ఈ రెండు సినిమాలపై ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలున్నాయి. అయితే ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ఇచ్చినప్పటినుండి.. ఈ సినిమా ల విషయంలో పోలికలు, తేడాలను సోషల్ మీడియా వ్యాప్తంగా బూతద్దంలో చూస్తున్నారు ప్రేక్షకులు, అల వైకుంఠపురములో పాటలు హిట్ అయితే సరిలేరు టీజర్ దుమ్ము దులిపింది. సరిలేరు పాటలు డల్ అయితే… అల వైకుంఠపురములో సాంగ్స్ లేచాయి. ఇక తాజాగా విడుదలైన రెండు ట్రైలర్ లో సరిలేరు నీకెవ్వరూ కామెడీ, యాక్షన్ ప్యాకేజ్ లో ఉంటే.. అల వైకుంఠపురములో స్టైలిష్, కామెడీగా ఉంది.

ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు గెస్ట్ గా రావడమే కాదు… విజయశాంతి – చిరు అపూర్వ కలయిక ఆ ఈవెంట్ లో హాట్ టాపిక్ అయ్యింది. అల వైకుంఠపురములో మ్యూజికల్ నైట్ కి అల్లు ఫ్యామిలీ మొత్తం వచ్చింది. అందులో అల్లు అర్జున్ స్పీచ్ హైలెట్ అయ్యింది. అయితే ఈ ఈవెంట్స్ ఈవిషయంలో మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాపై బుజ్ ఏర్పడింది. అల వైకుంఠపురములో ఈవెంట్ గెస్ట్ లేక కాస్త డల్ అయినట్లుగా అనిపించింది. మహేష్ సీరియస్ నెస్ తో కామెడీ చేస్తే.. అల్లు అర్జున్ మ్యానరిజంతో కామెడీ పండించాడు. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తే.. అల్లు అర్జున్ సినిమాతో టబు రీ ఎంట్రీ ఇచ్చింది. అలాగే ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్ లాంటి హేమాహేమీలంటే సరిలేరుకుంటే…. అల వైకుంఠానికి సచిన్ ఖేడ్కర్, మురళి శర్మ లాంటి హేమాహెమీలున్నారు. ఇక అల వైకుంఠాపురానికి హీరోయిన్ పూజ హెగ్డే ప్లస్ కాగా.. సరిలేరు నీకెవ్వరూ లో రష్మిక పూజ ముందు తేలిపోయేలా ఉంది. మరి ఇన్ని పోలికలు ఇన్ని తేడాలు ఉన్న ఈ రెండు సినిమాల హైప్ ఎలా ఉన్న.. సక్సెస్ రేట్ మాత్రం మూడు నాలుగు రోజుల్లో తేలిపోతుంది.

Tags:    

Similar News