రిషిని పరిచయం చేసిన మహర్షి.. టీజర్..!

Update: 2018-08-09 06:40 GMT

మహేష్ బాబు 'భరత్ అనే నేను' హిట్ సినిమా తర్వాత మళ్లీ ఎలాంటి సబ్జెట్ తీసుకుని.. ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో.. మా అభిమాన హీరో ని ఎలా చూస్తామో అనే అభిమానుల ఎదురు చూపులకు చెక్ చెపుతూ మహేష్ తన పుట్టిన రోజు కానుకగా... తన 25వ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్, టీజర్ విడుదల చేసి అభిమానులకు త్రిబుల్ ధమాకా ఇచ్చేసాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న సినిమాకి ముగ్గురు నిర్మాతలు. దిల్ రాజు, పివిపీ, అశ్వినీదత్ నిర్మాణంలో ఈ మూవీ జులైలో పట్టాలెక్కింది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ.. సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచి అస్సలు విరామమే లేకుండా వంశి ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నాడు. అందుకే మహేష్ బాబు పుట్టిన రోజు నాటికే సినిమాలోని మహేష్ లుక్ తో పాటు సినిమా టైటిల్, టీజర్ ని ఇచ్చేసి మహేష్ అభిమానులను థ్రిల్ చేసాడు వంశి.

పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ

ఇక టైటిల్ ని అందరిలో ఆసక్తిని పెంచుతూ రోజుకో లెటర్ ని సోషల్ మీడియాలో వదులుతూ ఫజిల్ గేమ్ పెట్టారు. అయితే వారు వదిలిన 'R, I , S, H, I' అక్షరాలతో అందరూ మహేష్ 25 మూవీ టైటిల్ రిషి గా ఫిక్స్ అయ్యారు. వంశి వదిలిన లెటర్స్ అందరూ మహేష్ మూవీ టైటిల్ అనుకుంటుంటే.. రిషి అనేది మహేష్ పాత్ర పేరని.. మహేష్ మూవీ టైటిల్ 'మహర్షి' అని గత అర్థరాత్రి రివీల్ చేశారు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ తో పాటుగా మహేష్ బాబు కలర్ ఎగరేస్తూ నడిచొస్తున్న స్టూడెంట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం. అంతేనా మళ్ళీ ఈ రోజు అంటే గురువారం 9.45 కల్లా 'మహర్షి' అదేనండి మహేష్ 'మహర్షి' సినిమా టీజర్ ని వదిలారు. మరి టీజర్ లో మహేష్ బాబు స్టూడెంట్ లుక్ లో కాలేజ్ లో కూల్ గా అమ్మాయిలను ఆలా అలా చూస్తూ నవ్వుతూ నడిచొస్తుంటే.. రిషి ని పరిచయం చేసామంటూ టీజన్ ని ఎండ్ చేశారు. మరి మహేష్ బాబు చిన్నగా పెరిగిన గెడ్డం లుక్ లో అచ్చం 25 ఏళ్ల కుర్రాడిలా నిజంగా స్టూడెంట్ అనిపించేలా ఉన్నాడు.

 

Similar News