మహేష్ వల్లే మహర్షి లేట్…!

ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల అంటూ గత ఏడాది మహర్షి సినిమా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది మొదట్లో మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ [more]

Update: 2019-04-04 07:19 GMT

ఏప్రిల్ 5న మహర్షి సినిమా విడుదల అంటూ గత ఏడాది మహర్షి సినిమా మేకర్స్ ప్రకటించారు. కానీ ఈ ఏడాది మొదట్లో మహర్షి సినిమా విడుదల ఏప్రిల్ 5 నుండి ఏప్రిల్ 25కి వెళ్లిందని స్వయానా మహర్షి ప్రొడ్యూసర్ దిల్ రాజు చెప్పాడు. కారణం మహర్షి సినిమా షూటింగ్ ని వంశీ నత్తనడక నడిపిస్తున్నాడని… అలాగే కొన్ని సీన్స్ ని రీషూట్స్ చేస్తున్నాడని.. అందుకే సినిమా షూటింగ్ లేట్ అవుతూ వస్తుందని అన్నారు. ఇక మొన్నీమధ్యన మహర్షి సినిమాని మహానటి సెంటిమెంట్ తో మే 9న విడుదల చేస్తున్నట్టుగా దిల్ రాజు ప్రకటించాడు.

యాడ్ ల కోసం షూటింగ్ కు బ్రేక్

కానీ ఇప్పటివరకు మహర్షి సినిమా షూటింగ్ పూర్తి కాలేదు. ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్ ఉన్నాయి. అయితే షూటింగ్ వంశీ పైడిపల్లి వలన లేట్ కాలేదని.. మహెష్ వల్లనే లేట్ అయ్యిందని అంటున్నారు. ఎందుకంటే మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి మహేష్ కమర్షియల్ యాడ్ షూట్స్ కోసం వెలుతున్నాడని, అందుకే మహర్షి సినిమా షూటింగ్ ఇలా లేట్ అవుతూ రావడంతో విడుదల పోస్ట్ పోన్ అవడం జరిగిందని అంటున్నారు. మొన్నామధ్యన ఒక యాడ్ షూట్ కోసం సౌతాఫ్రికా వెళ్లిన మహేష్ తాజాగా మరో యాడ్ షూట్ కోసం మహర్షి షూటింగ్ కి బ్రేక్ ఇస్తున్నాడట.

Tags:    

Similar News