విడుదలకు ముందే ‘మహర్షి’ రికార్డులు

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ ఈ నెల 9న వరల్డ్ వైడ్ గా [more]

Update: 2019-05-04 08:55 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’ ఈ నెల 9న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవ్వబోతుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం ఓవర్సీస్ లో భారీ స్థాయిలో రిలీజ్ అవ్వబోతుంది. అక్కడ ఈ చిత్రానికి తొలి రోజు 2500కు పైగా ప్రీమియర్ షోలు పడనున్నాయి. ఈ రేంజ్ లో అమెరికాలో తెలుగు సినిమా రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. అలా ముందుగానే రికార్డు క్రియేట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు కలెక్షన్ల పరంగా కొత్త రికార్డును సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.

తెలుగు రాష్ట్రాల్లో కూడా

అలానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మూవీ అదే రేంజ్ లో రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఇక్కడ కూడా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని చెబుతున్నారు ట్రేడ్ వారు. ఇక ఈ చిత్రాన్ని రెండేళ్లు గ్యాప్ తరువాత వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసాడు. ఇందులో అల్లరి నరేశ్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ ఈ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ సంగీతం అందించాడు.

Tags:    

Similar News