‘మహర్షి’ నుంచి 29న ‘పాలపిట్ట’

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. [more]

Update: 2019-04-27 14:02 GMT

సూపర్‌స్టార్ మహేష్ హీరోగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, పి.వి.పి సినిమా పతాకాలపై హై టెక్నికల్ వేల్యూస్‌తో రూపొందుతోన్న భారీ చిత్రం ‘మహర్షి’. సూపర్‌స్టార్ మహేష్‌కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. మహేష్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 9న వరల్డ్‌ వైడ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను మే 1న ఎంతో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇటీవల విడుదైలెన నాలుగు పాటలకు శ్రోతల నుండి అద్భుతమెన స్పందన వచ్చింది. ఇక సినిమాలోని ఐదో పాట అయిన ‘పాలపిట్ట..’ను ఏప్రిల్ 29 ఉదయం 9.09 గంటలకు విడుదల చేయబోతున్నారు. మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకొనే ఫోక్ సాంగ్ గా ఈ పాట రూపొందింది.

Tags:    

Similar News