అప్పుడు పెంచినా ఉపయోగం ఏముంటుంది..?

బడా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే మల్టిప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలు టికెట్స్ రేట్లు పెంచేసి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నాయి.ఇక బడా నిర్మాత దిల్ రాజు లాంటి వాళ్లు [more]

Update: 2019-05-11 07:32 GMT

బడా సినిమాలు విడుదలవుతున్నాయి అంటే మల్టిప్లెక్స్ థియేటర్ యాజమాన్యాలు టికెట్స్ రేట్లు పెంచేసి ప్రేక్షకులను భయపెట్టడానికి రెడీ అవుతున్నాయి.ఇక బడా నిర్మాత దిల్ రాజు లాంటి వాళ్లు కూడా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్స్ రేట్లు పెంచితేనే గిట్టుబాటు అవుతుంది అంటూ స్టేట్మెంట్స్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. తాజాగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా టికెట్స్ రేట్ల వివాదం ఇప్పుడు కోర్టు మెట్లెక్కింది. మహర్షి సినిమా విడుదలకు ముందురోజు మహర్షి సినిమా రేట్లు పెరిగాయని.. ప్రేక్షకుడి నెత్తి మీద బండపెట్టబోతున్నట్లుగా మీడియాలో వార్తలు రావడం, మహర్షి రేట్లు పెంపున‌కు తెలంగాణ గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలొచ్చాయి. కానీ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాత్రం మహర్షి సినిమా టికెట్స్ పెరగలేదని యధాతథంగానే టికెట్ రేట్లు ఉన్నాయని చెప్పాడు.

కోర్టు మెట్లెక్కిన నిర్మాత‌లు

అయితే థియేటర్స్ యాజమాన్యాలు సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు టికెట్స్ ధర పెంపున‌కు ప్రయత్నాలు చేసినా పోలిసుల నుండి ఎటువంటి హామీ రాకపోయేసరికి థియేటర్స్ యాజమాన్యాలు తాజాగా హై కోర్టు మెట్లెక్కాయి. అయితే హై కోర్టు ఈ టికెట్స్ రేట్ల పెంపకంపై తీర్పును ఈనెల 16కి వాయిదా వేసింది. మరి 16 తర్వాత టికెట్స్ వివాదం ముగిసి రేట్లు పెంచుకోవచ్చని థియేటర్స్ యాజమాన్యానికి కోర్టు చెప్పినా.. ఇప్పుడు మహర్షికి ఉపయోగం లేదనిపిస్తుంది. ఎందుకంటే మహర్షి సినిమాకి ప్రేక్షకుల నుండి క్రిటిక్స్ నుండి కూడా మిక్స్డ్ టాక్ రావడం చూస్తే ఈ సినిమా ఈ వీకెండ్ తర్వాత వీక్ అవడం ఖాయంగానే కనబడుతుంది. మరి ఇలాంటి టాక్ తో మహర్షి సోమవారం నుండి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News