మ‌హ‌ర్షి సినిమా టాక్..!

మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే 25వ సినిమా మహర్షి నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి [more]

Update: 2019-05-09 08:01 GMT

మహేష్ బాబు కెరీర్ లో ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయే 25వ సినిమా మహర్షి నేడు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో ముగ్గురు బడా నిర్మాతలు నిర్మించిన మహర్షి మూవీకి అక్కడక్కడా మిక్స్డ్ టాక్ అక్కడక్కడా పాజిటివ్ టాక్ వినబడుతుంది. వంశీ పైడిపల్లి మహర్షి సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించాడని అంటున్నారు. మరి భారీ అంచనాలతో భారీగా విడుదలైన మహర్షి సినిమాలో మహేష్ నటన అద్భుతమంటున్నారు ప్రేక్షకులు. హీరోయిన్ పూజ హెగ్డే గ్లామర్ డాల్ గా సెక్సీ గా ఉందని… సాంగ్స్ లో పూజ గ్లామర్ బాగుందని అంటున్నారు. ఇక అల్ల్లరి నరేష్ రవి పాత్రలో అద్భుతంగా నటించాడని… గతంలో గమ్యం సినిమాలో గాలి శీను పాత్రకి ఎంతగా పేరొచ్చిందో.. మహర్షిలో రవి పాత్రకి అంతగా పేరొస్తుందని అంటున్నారు.

స్టైలిష్ లుక్స్ లో మ‌హేష్ బాబు

ఇలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి ఇక అల్ల‌రి నరేష్ పేరు పరిశీలించడం ఖాయమంటున్నారు. ఇక దేవిశ్రీ మ్యూజిక్ కి ప్రేక్షకులు అంతగా ఇన్వాల్వ్ కాకపోయినా.. నెమ్మదిగా పాటలు కనెక్ట్ అవుతాయని… సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉందని అంటున్నారు. కాకపోతే మహర్షి నిడివి ప్రేక్షకులను బోర్ కొట్టిస్తుంది. అలాగే సెకండ్ హాఫ్ లో మహేష్ ఎమోషనల్ సీన్స్ కదిలించాయని.. మహేష్ స్టూడెండ్ గా కాలేజ్ సన్నివేశాలు, రైతుగా, సీఈవో గా సూపర్ స్టైలిష్ గా కనిపించాడని అంటున్నారు. ఇక వంశీ పైడిపల్లి నిర్మాతలచే ఎంతగా ఖర్చు పెట్టించాడో.. ఆ రిచ్ నెస్ మొత్తం స్క్రీన్ మీద కనబడుతుందని అంటున్నారు. మరి మహర్షి మీది ప్రేక్షకుల టాక్ ఇలా ఉంటే.. క్రిటిక్స్ టాక్ ఎలా ఉందో చూడాలి.

Tags:    

Similar News