మహర్షి మళ్లీ వాయిదా పడబోతుందా..?

డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాలంటేనే రీషూట్స్ కంపల్సరీ. అతను తీసిన సినిమాలు ఏవీ రీషూట్ చేయకుండా బయటికి రాలేదు. అప్పుడప్పుడు ఈ రీషూట్స్ వల్ల సినిమాలు వాయిదా పడ్డ [more]

Update: 2019-02-22 08:34 GMT

డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాలంటేనే రీషూట్స్ కంపల్సరీ. అతను తీసిన సినిమాలు ఏవీ రీషూట్ చేయకుండా బయటికి రాలేదు. అప్పుడప్పుడు ఈ రీషూట్స్ వల్ల సినిమాలు వాయిదా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ లాంటి స్టార్ హీరో దొరికినా వంశీ మారలేదు అని అర్థం అవుతుంది. ప్రస్తుతం వంశీ మహేష్ తో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ పై ఇంతవరకు మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ లేదు. ఆమధ్య ఏప్రిల్ 7న అన్నారు. కానీ రీసెంట్ గా ఏప్రిల్ 25కు వాయిదా వేశారు.

మే లేదా జూన్ లోనే…

ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా వచ్చేది అనుమానమే అంటున్నారు. కారణం ఈ మూవీకి సంబంధించి ఇంకా చాలా వర్క్ పెండింగ్ లో ఉందట. రెండు వారాలు వాయిదా వేసినా ఆ వర్క్ కంప్లీట్ అయ్యే అవకాశం లేదంట. సినిమా తేదీ వాయిదా పడడానికి ఇది ఒక్కటే కారణం కాదు. నిర్మాతల మధ్య అభిప్రాయబేధాలతో పాటు మహేష్ కూడా షూటింగ్ కు డుమ్మా కొట్టడం కారణంగా తెలుస్తోంది. అందుకే ఈ మూవీ మే లేదా జూన్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Tags:    

Similar News