ఎట్టకేలకు ‘మహర్షి’ రిలీజ్ డేట్ ఖరారు

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది జూన్ లో సెట్స్ మీదకెళ్లిన మహర్షి [more]

Update: 2019-03-06 12:48 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో తెరకెక్కుతున్న మహర్షి సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది జూన్ లో సెట్స్ మీదకెళ్లిన మహర్షి సినిమాని మేకర్స్ ముందుగా ఏప్రిల్ 5న ఉగాది కానుకగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. కానీ షూటింగ్ లో జాప్యం వలన విడుదల తేదీ కాస్తా ఏప్రిల్ 25కి మరింది. ఏప్రిల్ 25న విడుదల కచ్చితంగా ఉంటుందని… మహేష్ బాబు దిల్ రాజుతో ఆ డేట్ ఇప్పించాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏప్రిల్ 25నే మహర్షి మూవీ విడుదల అంటూ కన్ఫర్మ్ చేసిన టీం తాజాగా మరో కొత్త డేట్ ఇచ్చింది.

క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు

ఏప్రిల్ 15 వరకు మహర్షి షూటింగ్ జరుగుతుంది కాబట్టి.. కేవలం పది రోజుల్లో సినిమాని విడుదల చెయ్యడం అంటే పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ కి టైం సరిపోదని.. అందుకే మహర్షి విడుదల డేట్ మరొచ్చంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న మహర్షి టీమ్ వెంటనే మహర్షి సినిమా విడుదలపై క్లారిటీ ఇచ్చేసింది. మహర్షి నిర్మాత దిల్ రాజు స్వయానా మహర్షి సినిమా మే 9న విడుదల చేస్తామంటూ ప్రకటించారు.

Tags:    

Similar News