మహర్షి వచ్చిందని తీసేశారు..ఇప్పుడు మళ్లీ..!

ఈ ఏడాది సమ్మర్ స్టార్టింగ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తూ నాలుగు సినిమాలు వచ్చాయి. మజిలి, చిత్రలహరి, జెర్సీ, కాంచన 3 వంటి చిత్రాలు [more]

Update: 2019-05-11 07:23 GMT

ఈ ఏడాది సమ్మర్ స్టార్టింగ్ లో బాక్స్ ఆఫీస్ వద్ద జోరు చూపిస్తూ నాలుగు సినిమాలు వచ్చాయి. మజిలి, చిత్రలహరి, జెర్సీ, కాంచన 3 వంటి చిత్రాలు డీసెంట్ హిట్ అందుకుని సదరు హీరోల స్థాయికి మించి ఆ సినిమాలు బాగానే ఆడుతున్నాయి. అయితే ఈ తరుణంలో మహేష్ మహర్షి రావడంతో దాదాపు అన్ని థియేటర్స్ ఈ సినిమాకే ఇచ్చేసారు. కానీ మహర్షి టాక్ వేరే విధంగా రావడంతో ఇప్పుడు చాలా చోట్లా ఈ సినిమాను తీసేయాలని చూస్తున్నారు. ఆ తీసేసిన థియేటర్స్ లో మజిలీ, జెర్సీ సినిమాలు వేసుకుంటే ఇంకొంచం కలెక్షన్స్ అయినా వస్తాయని సదరు డిస్ట్రిబ్యూటర్స్ ఆలోచనట.

అవ‌కాశాన్ని క్యాష్ చేసుకోవాలిగా…

లేదంటే ఈనెలాఖరికి ఎలాగో సీత, అల్లు శిరీష్‌ ఎబిసిడి, సూర్య ఎన్జీకె, తమన్నా అభినేత్రి 2 వంటి సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమాలు ఏమైనా కాష్ చేసుకోవాలి. అసలు ఈ వీకెండ్ అయ్యే సరికి మహర్షి పరిస్థితి ఏంటో అర్ధం అయిపోతుంది కనుక ఒకవేళ మహర్షికి గ్యాప్ వస్తే ఆ గ్యాప్ ని ఎవరైనా సరిగ్గా వాడుకుంటే బెటర్ అని చెబుతున్నారు. అసలే సమ్మర్ పైగా సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే సినిమాలని ఆడించుకోవాలి. మరి ఎవరు ఆ ప్రయత్నం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News