మహర్షి హంగామా మాములుగా లేదు..!

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా మహర్షి హంగామా షురూ అయ్యింది. విడుదలకు నెల రోజులే గడువు ఉండడంతో.. మహర్షి టీం [more]

Update: 2019-04-06 07:09 GMT

మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా మహర్షి హంగామా షురూ అయ్యింది. విడుదలకు నెల రోజులే గడువు ఉండడంతో.. మహర్షి టీం మహర్షి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసేసింది. మహేష్ – పూజ హెగ్డే జంటగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ ని ఉగాది కానుకగా టీం కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. మహర్షి టీజర్ లో మహేష్ బాబు లుక్స్, స్టైల్ అన్ని సూపర్బ్ గా ఉన్నాయి. రిషి కుమార్ పాత్రలో మహేష్ చాలా స్టైలిష్ గా చాపర్ నుండి దిగడంతో మొదలైన టీజర్ రిషి కుమార్ సక్సెస్ స్టోరీ ఇక్కడితో ఆగిపోయినట్లేనా.. అంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ లో మీడియా మీట్లో మహేష్ కి ప్రశ్న ఎదురు కాగా… దానికి మహేష్ సక్సెస్ లో పుల్ స్టాప్స్ ఉండవు. కామాస్ మాత్రమే ఉంటాయి. సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అన్న భారీ డైలాగ్స్ కి థియేటర్స్ లో విజిల్స్ పాడడం ఖాయంగా కనబడుతుంది.

ఆకట్టుకున్న టీజర్

ఇంకా నాకో ప్రాబ్లమ్ ఉంది సార్… ఎవడైనా నువ్వు ఓడిపోతావంటే… గెలిచి చూపించడం నాకు అలవాటు అంటూ స్టైలిష్ యాక్షన్ తో మహేష్ మెరుపులు మెరిపించాడు. కాకపోతే టీజర్ చివర్లో మహేష్ చేసిన ఆ యాక్షన్ సన్నివేశాన్ని చూస్తుంటే రెండు మూడు సినిమాల్లో ఆ యాక్షన్ సీన్ ని చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. మహేష్ భరత్ అనే నేనులో, అల్లు అర్జున్ సరైనోడులో హీరో విలన్స్ ని కొడుతూ… రౌడీ కాలుని పట్టుకుని లాక్కెళ్ళే సీన్ మళ్ళీ మహర్షి లో వంశీ పైడిపల్లి రిపీట్ చేసాడనిపిస్తుంది. ఇది తప్ప ఓవరాల్ గా మహర్షి టీజర్ మాత్రం అదుర్స్ అన్న రేంజ్ లో ఉంది. దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ బాగున్నాయి. కాకపోతే హీరోయిన్ పూజ హెగ్డేని కానీ, మహేష్ ఫ్రెండ్ కేరెక్టర్ అల్లరి నరేష్ రవి పాత్రని మహర్షి టీజర్ లో రివీల్ చెయ్యకుండా దాచేసారు.

Tags:    

Similar News