మహర్షి అక్కడ కూడా ఫెయిలా..?

హిట్ టాక్, వసూళ్ల జోరుతో దూసుకుపోతున్న మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. అయితే సీడెడ్ లో ఈ మూవీ అంచనాలకు [more]

Update: 2019-05-15 08:34 GMT

హిట్ టాక్, వసూళ్ల జోరుతో దూసుకుపోతున్న మహర్షి సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబడుతున్న విషయం తెలిసిందే. అయితే సీడెడ్ లో ఈ మూవీ అంచనాలకు తగ్గట్లుగా కలెక్షన్లు రాబట్టలేకపోయింది. నైజాం లాంటి ఏరియాస్ లో రూ.16.6 కోట్ల షేర్ కొల్లగొట్టిన ఈ చిత్రం.. సీడెడ్ లో కేవలం రూ.5.6 కోట్ల షేర్‌తో సరిపెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తుంది.
బెనిఫిట్ షోల నుండే ఈ సినిమా ఊపు తగ్గింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అక్కడ అంతంతమాత్రంగా నడిచాయి. మిగిలిన ఏరియాస్ తో పోలిస్తే మహేష్ మార్కెట్ ఇక్కడ చాలా తక్కువ.

సీమ‌లో లాస్ వ‌చ్చిన‌ట్లే

రాయలసీమలో తెల్లవారుజామున షోలు నిండటం కష్టమైంది అంటే మహేష్ పరిస్థితి అక్కడ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక్కడ పవన్, చరణ్, ఎన్టీఆర్ లతో పోలిస్తే మహేష్ వెనుకే ఉంటాడు. మహేష్ గత చిత్రం భరత్ అనే నేను సూపర్ హిట్ అయినప్పటికీ ఫుల్ రన్ లో రూ.10 కోట్ల షేర్ రాబట్టలేకపోయింది. కానీ ఇప్పుడు మహర్షి సినిమా అక్కడ 12 కోట్లకి అమ్మారు. ఓవరాల్ గా ఈ మూవీ అక్కడ 10 కూడా రాబట్టడం కష్టమే అని అర్థం అవుతుంది.

Tags:    

Similar News