అక్కడ ‘మహర్షి’ క్రేజ్ లేదా..?

మహేష్ మహర్షి చిత్రం వరల్డ్ వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులు కొల్లగొట్టడం ఖాయమన్నారు. [more]

Update: 2019-05-09 12:42 GMT

మహేష్ మహర్షి చిత్రం వరల్డ్ వైడ్ గా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అనేక రికార్డులు కొల్లగొట్టడం ఖాయమన్నారు. ఇక ఓవర్సీస్ లో మహేష్ క్రేజ్ తో మహర్షి రికార్డులు సృష్టిస్తుందని.. మహేష్ క్రేజ్ తో భారీగా ఓవర్సీస్ కలెక్షన్స్ వస్తాయని అన్నారు. తాజాగా మహేష్ మహర్షికి ఓవర్సీస్ లో చుక్కెదురైంది. మొదటిరోజు ప్రీమియర్స్ తో భారీగా కలెక్షన్స్ కొల్లగొడుతుందని అనుకున్న వారికి మహర్షి షాకిచ్చిందనే చెప్పాలి. యుఎస్ లో మహర్షి ప్రీమియర్స్ తో ఒక మిలియన్ డాలర్స్ అందుకుంటుందని ఆశించిన వారికీ మహర్షి భారీ షాకిచ్చింది.

అనుకున్నదాంట్లో సగమే…

మహేష్ క్రేజ్ కానీ, వంశీ పైడిపల్లి లాజిక్ గానీ, దిల్ రాజు మ్యాజిక్ కానీ మహర్షికి పని చేయలేదు. ఒక మిలియన్ డాలర్స్ అందుకుంటుందనకుంటే… కేవలం హాఫ్ మిలియన్ డాలర్స్ వసూలు చేసి ఉసూరుమనిపించింది. మహేష్ గత చిత్రాలైన స్పైడర్, భరత్ అనే నేను కూడా ఒక మిలియన్ డాలర్ వసూలు చేస్తే.. మహర్షికి కేవలం సగానికే ఆగిపోయింది. మరి మహేష్ సినిమాలకు ఓవర్సీస్ లో భారీ క్రేజ్ ఉంటుంది. కానీ మహర్షికి ఆ రేంజ్ క్రేజ్ ఎందుకు రాలేదో ఇప్పటికి అర్ధం కానీ పరిస్థితి.

Tags:    

Similar News