హమ్మయ్య మహర్షికి గండం గడిచింది..!

మహేష్ మహర్షి సినిమా గత గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి [more]

Update: 2019-05-18 06:53 GMT

మహేష్ మహర్షి సినిమా గత గురువారం విడుదలై మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మహేష్ కెరీర్ లో 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా అందరూ ఎక్స్ పెక్ట్ చేసిన హిట్ అయితే అవలేదు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, మరో ఇద్దరు నిర్మాతలు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన మహర్షి సినిమాకి వస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే బడ్జెట్ కి సరిపడా కలెక్షన్స్ రావొచ్చు అని అంటున్నారు. కొన్నిచోట్ల బ్రేక్ ఈవెన్ కి చేరినా మరికొన్ని చోట్ల మహర్షికి నష్టాలు తప్పేలా కనబడటం లేదు. అందులో ముఖ్యంగా సీడెడ్, ఓవర్సీస్ బయ్యర్లకు మహర్షితో ఎంతో కొంత నష్టాలు మిగిలేలా కనబడుతుంది. మరి మహేష్ ఎన్నడూ లేని విధంగా వంశీ పైడిపల్లి నిర్మాతలతో కలిసి సినిమాని తెగ ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. నేడు మహర్షి విజయోత్సవ సభ అంటూ హడావిడి కూడా మొదలైంది.

మరో వారం తిరుగులేదుగా…

అయితే మహర్షి సినిమా మొదటి వారానికే చుట్టేయాల్సి వస్తుందేమో అనుకున్నారు. అల్లు హీరో శిరీష్ ఏబీసీడీ సినిమాకి పాజిటివ్ టాక్ పడితే ఇలానే అవుతుంది అని అనుకున్నారు. కానీ ఏబీసీడీ సినిమాకి యావరేజ్ టాక్ కూడా రాకపోయేసరికి ప్రేక్షకులకు మరో వారం పాటు మహర్షి సినిమా తప్ప మరో దిక్కు లేదు. మళ్లీ బెల్లంకొండ శ్రీనివాస్ – కాజల్ అగర్వాల్ సీత సినిమా బాక్సాఫీసు వద్దకు వచ్చే వరకు మహర్షి సినిమాదే హావా. మరి మహర్షి సినిమాకి మరో వారం కలిసొచ్చినట్లే అనిపిస్తుంది. మహేష్ బాబు మహర్షి సినిమాతో సూపర్ బ్లాక్ బస్టర్ కొట్టినట్లుగా ఫీల్ అవుతున్నాడు. మరి మరో వారం దున్నేసుకో మహర్షి అంటూ సోషల్ మీడియాలో మహేష్ అభిమానులు రెచ్చిపోతూ పోస్ట్ లు పెడుతున్నారు.

Tags:    

Similar News